వేసవిలో చాలమందికి ముక్కులో నుంచి రక్తం బయటకు వస్తుంది. ముఖ్యంగా 15 ఏళ్ల లోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా రక్తం కారినప్పుడు కొంతమంది చాలా భయపడి పోతుంటారు. మరికొంత మంది లైట్ తీసుకుంటారు. నిజానికి ఇది అనారోగ్య సమస్య కాదు. వివిద రుగ్మతల కారణంగా ఇలా జరుగుతుంది. ముక్కు ముందు భాగంలో సున్నితమైన రక్తనాళాలు ఉంటాయి. వేడి గాలి పీల్చినప్పుడు ఇవి సంకోచానికి గురి కావడం వల్ల రక్తం బయటకు వస్తుంది. కొందరిలో ఈ రక్తకణాలు బలంగాను మరికొందరిలో బలహీనంగాను ఉంటాయి. బలహీనంగా ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. శరీరం వేడి శాతం ఎక్కువగా ఉన్నవారిలో కూడా ముక్కు నుంచి రక్తం బయటకు వస్తుంది. కాబట్టి వేసవిలో ఈ సమస్య ఉన్నవారు బయపడాల్సిన పని లేదని తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. .
* ఈ సమస్య ఉన్నవారు ఎక్కువగా బయట తిరగరాదు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గొడుగు తీసుకొని వెళ్ళడం, వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవడం వంటివి చేయాలి.
* మద్యం, ధూమపానం వంటివి సేవించడం వల్ల కూడా ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి.
* వేడి ద్రవాలు సేవించడం తగ్గించాలి. ఎదుకంటే ముక్కులోని లైనింగ్ దెబ్బ తినే అవకాశం ఉంది. తద్వారా రక్తం కారే సమస్య ఎక్కువౌతుంది.
* రూం టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడూ ఎయిర్ కండిషనర్, కూలర్ వంటివి ఉపయోగించాలి. తద్వారా ముక్కులో నుంచి రక్తం కారే సమస్యను అధిగమించవచ్చు.
* ఇంకా ఈ సమస్య ఉన్నవారు కాటన్ గుడ్డముక్క లేదా కర్చీఫ్ ఎల్లప్పుడు దగ్గర ఉంచుకోవాలి. ముక్కులో నుంచి రక్తం కారడం మొదలైనప్పుడు వెంటనే ముక్కుకు అడ్డంగా కాటన్ గుడ్డముక్కను అడ్డుగా పెట్టుకోవాలి.
ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ వైద్యుల సూచనల మేరకు మెడిసన్ వాడితే ఈ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.
Also Read:TTD:సప్తవర్ణశోభితం శ్రీవారి పుష్పయాగం