ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో సిద్దు జొన్నలగడ్డ బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు.
సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘సుందరం మాస్టర్ ట్రైలర్ చూశాను. ఎంతో బాగుంది. హర్షని ఓ కమెడియన్ అని చెప్పడం నాకు నచ్చదు. అతను ఓ కామిక్ యాక్టర్. ఓ సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది. డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్‌కు ఈ తొలి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వాలి. ఈ సినిమాను నిర్మించిన రవితేజ గారికి థాంక్స్. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఇలా కొత్త వాళ్లని ఎంకరేజ్ చేసేందుకు సినిమాలు నిర్మిస్తున్నారు. కలర్ ఫోటో, మంత్ ఆఫ్ మధు, బేబీ ఇలా ఎప్పటికప్పుడు హర్ష తనకి తాను నటుడిగా నిరూపించుకుంటూ వస్తున్నారు. నాకు హర్ష పర్సనల్‌గా కూడా తెలుసు. ఆఫ్ స్క్రీన్‌లోనూ బాగా నవ్విస్తుంటాడు. ట్రైలర్‌లో చూసినట్టుగా హర్షని సీరియస్‌గా ఎప్పుడూ చూడలేదు. హీరోయిన్ దివ్య శ్రీపాదకు ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హర్ష చెముడు మాట్లాడుతూ.. ‘పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేం. నాగ చైతన్య గారు పాటను, సాయి ధరమ్ తేజ్ గారు టీజర్‌ను లాంచ్ చేశారు. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి గారు, రవితేజ గారు, సిద్దు జొన్నలగడ్డ గారు మాకు సపోర్ట్‌గా నిలిచారు. పదేళ్ల క్రితం ఆ ఆడియెన్స్ మధ్యలో ఉన్నాను. ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నాను. మనం గట్టిగా నమ్మితే ఏదైనా సాధించగలం. ఫిబ్రవరి 23న మా చిత్రాన్ని థియేటర్లో చూసి ఎంకరేజ్ చేయండి’ అని అన్నారు.
Also Read:బన్నీతో ‘ఎలిఫెంట్ ‘.. వంగా ప్లాన్!