మిరియాలతో ఆరోగ్యం…..

93
Black pepper health benefits

మిరియాలు పోడి గా చేసుకోని, పెరుగు లో కలుపు కోనితాగితే జలుబు నుండి ఉపశమనం పోందవచ్చు.

మిరియాలు, వేపకు, నీళ్ళు ఈ ముండింటిన్ని కలిపి మిక్సీ వేసి ఆ తరువాత ఆ నీళ్ళు వడకట్టి తాగితే శరీరం లో దురదలు మట్టు మాయం అవుతాయి.

మిరియాలు పోడి చేసి తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. పొట్ట ఉబ్బరం తగ్గించే ఔషధగుణాలు మిరియాలలో పుష్కలంగా ఉన్నాయి.

Black pepper health benefits

అరటి పండు లో మిరియాల పోడి చల్లి తినిపిస్తే శిశువులకు జీర్ణం సరిగా అవుతుంది.

కండరాలు,నరాలు నొప్పిగా ఉన్నప్పుడు చిటికెడు మిరియాల పోడి బాదంపప్పుతో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

చిగుళ్ల వాపు,నోటి నుంచి రక్తం కారడం వంటి సమస్యలు బాధిస్తుంటే చిటికెడు రాళ్ల ఉప్పు , మిరియాల పోడి మిశ్రమాన్ని చిగుళ్ల కు రాసి గోరు వెచ్చని నీటితో పుక్కిలిస్తే ఉపశమనం లభిస్తుంది.

కీళ్ల నోప్పులతో బాధపడే వారు మిరియాలను నువ్వుల నూనెలో వెయించి పోడి చేసి నొప్పి ఉన్నచోట ఈ మిశ్రమాన్ని కట్టు కడితే నొప్పి,వాపు తగ్గుతాయి,

శరీరం లో అధిక కొవ్వును తగ్గించడానికి మిరియాల రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Black pepper health benefits

గోంతు గరగరగా వుంటే గోరు వెచ్చని పాలలో మిరియాలపోడి ,అర స్పూన్ పసుపు, స్పూన్ తేనె వేసి కలిపి తాగితే ఉపశమనం కలుగుతుందంలున్నారు ఆయుర్వేద వైద్యులు

అరగ్రాము మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం సాయంత్రం తీసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.