మిరియాలతో ఆ సమస్యలన్నీ దూరం!

90
- Advertisement -

వంటింట్లో వాడే ఘాటైన మసాలా దినుసుల్లో మిరియాలు కూడా ఒకటి. ఇవి మంచి సువాసనను వెదజల్లుతు వంటల రుచిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే మిరియాలను మసాలా దినుసుల్లోనే రారాజుగా పరిగణిస్తారు. అయితే మిరియాలను కేవలం వంటల్లోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఎన్నో వ్యాధులకు మిరియాలను శక్తివంతమైన ఔషధంలా పరిగణిస్తారు ఆయుర్వేద నిపుణులు. మిరియాలలో విటమిన్ కె,సి, ఏ వంటి పోషకాలతో పాటు శరీరంలోని ప్రిరాడికల్స్ తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ వివిధ రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో ఎంతగానో ఉపయోగ పడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. .

ప్రతిరోజూ ఉదయం పూట పడగడుపున మిరియాల రసం తాగితే ఎన్నో ప్రయోజనలు కలుగుతాయట. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ మెరుగుపడి మలబద్దక సమస్య దూరం అవుతుంది. ప్రతిరోజూ మనం తాగే టీలో కొద్దిగా మిరియాల పొడి వేసుకొని తాగితే శరీరంలోని మెటబాలిజం క్రమబద్దంగా ఉంటుంది. కడుపులో గ్యాస్ ఏర్పడినప్పుడు మజ్జిగ లేదా పెరుగులో ఒక స్పూన్ మిరియాల పొడి కలుపుకొని తాగితే.. ఉదర సమస్యలన్నీ దురమౌతాయి. చాలమంది రాత్రి పూట అజీర్తితో భాద పడుతుంటారు. అలాంటి వారు పాలతో పాటు మిరియాల పొడిని కలిపి తాగితే అజీర్తి కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరం అవుతాయి.

అలాగే బెల్లంతో పాటు మిరియాలను జోడించి తింటే దగ్గు, కఫం వంటి సమస్యలు తగ్గిపోతాయి. పంటినొప్పి, చిగుళ్లలో రక్తం వంటి సమస్యలు ఉన్న వాళ్ళు పసుపులో కొద్దిగా మిరియాల పొడి జోడించి దంతక్షయం చేస్తే చిగుళ్ల వాపు, పంటినొప్పి, చిగుళ్లో రక్తం కారుట వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇవే కాకుండా వివిద రకాల క్యాన్సర్ కరకాలను దూరం చేయడంలో కూడా మిరియాలు ఎంతగానో ఉపయోగ పడతాయట. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ కరకాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:కేసీఆర్ బస్సుయాత్ర..ఈసీని కలిసిన కేతిరెడ్డి

- Advertisement -