చాలామందికి కాఫీ లేదా టీ తాగనిదే రోజు ప్రారంభంకాదు. వందలో కనీసం 90 మందికి ఇది ఖచ్చితమైన అలవాటు. వేడి వేడి కాఫీ గొంతులోకి దిగితేగానీ హుషారుగా ఉండలేరు. అయితే కాఫీకి సంబంధించి ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయం వెల్లడైంది. కాఫీ తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా బ్లాక్ కాఫీలోని కెఫీన్‌తో పాటు అందులో వుండే ఇతరత్రా మూలకాలన్నీ కూడా మెదడులోని హానికర ప్రోటీన్ల శాతాన్ని తగ్గించడం ద్వారా మతిమరుపు రాకుండా అడ్డుకుంటుందని పరిశోధకులు తేల్చేశారు.
బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్‌గా పాలు, చక్కెరతో తయారు చేసే కాఫీకి బదులుగా తక్కువ క్యాలరీలున్న బ్లాక్ కాఫీ తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీని తాగడం వల్ల శరీర పనితీరు 11-12 శాతం పెరుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది. బ్లాక్ కాఫీని రెగ్యులర్‌గా తాగడం వల్ల డిప్రెషన్ ప్రమాదం తగ్గి, రోజంతా ఉల్లాసంగా, ఆనందంగా ఉంటారని పేర్కొన్నారు.
బ్లాక్ కాఫీ బరువు తగ్గడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి జీవక్రియ రేటును పెంచడంతో పాటు ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు. వయస్సు పెరిగే కొద్ది చిత్తవైకల్యం, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధులు లాంటి జ్ఞాపక శక్తి లోపాలు లాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చనని అధ్యయనాలు చెబుతున్నాయి.
Also Read:హరిహర వీరమల్లు..రిలీజ్ డేట్ పిక్స్

