బ్లాక్ క్యారెట్ ప్రయోజనాలు తెలుసా?

20
- Advertisement -

మనందరికీ క్యారెట్ గురించి తెలిసే ఉంటుంది. చాలామంది క్యారెట్ తో చేసిన వంటకాలను తినడానికి అమితమైన ఇష్టం కనబరుస్తుంటారు. క్యారెట్ ను వంటలలో మాత్రమే కాకుండా స్టీట్స్ తయారీలోనూ పిండి వంటలలోనూ ఉపయోగిస్తూ ఉంటారు. సాధారణంగా క్యారెట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఎక్కువ శాతం మార్కెట్ లో ఇవే దొరుకుతుంటాయి. కానీ ఇందులో మరో రకం కూడా ఉంది. అవే బ్లాక్ క్యారెట్.. బయటి దేశాలలో వీటిని ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మన దేశంలో వీటిని చాలా అరుదుగా చూస్తుంటాము. ఒకవేళ మీరు నివశిస్తున్న ప్రదేశాల్లో ఈ బ్లాక్ క్యారెట్ కనిపిస్తే అసలు వదలొద్దని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సాధారణ క్యారెట్ తో పోల్చితే ఈ బ్లాక్ క్యారెట్ లో మరిన్ని పోషకాలు ఉంటాయట.

ఈ బ్లాక్ క్యారెట్ లో విటమిన్ ఏ, సి, బి12, కె, వంటి వాటితో పాటు ఆంథోసైనిన్ అనే మూలకం కూడా లభిస్తుందట. అందుకే ఈ బ్లాక్ క్యారెట్ తిన్నప్పుడు రోగ నిరోధక శక్తి వేగంగా మెరుగుపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తూ ప్రేగుల కదలికలను ప్రోత్సహిస్తుందట. తద్వారా మలబద్దకం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వేగంగా తగ్గిపోతాయి. బ్లాక్ క్యారెట్ కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఇందులో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ ఏ వంటి పోషకాలు దృష్టి లోపాన్ని తగ్గించి చూపును పెంచుతాయట. ఇంకా వయసు పెరిగే కొద్ది ఏర్పడే కంటి శుక్లాలను తగ్గించడంలో కూడా ఈ బ్లాక్ క్యారెట్ ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఇంకా ఇందులో మధుమేహాన్ని అదుపులో ఉంచే గుణాలు ఉంటాయి, అలాగే రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయ పడతాయి. ఇంకా గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడం, ఆర్థరైటిస్ నొప్పులను నివారించడం లోనూ బ్లాక్ క్యారెట్ ఎంతో ప్రయోజనకరం. కాబట్టి ఈ బ్లాక్ క్యారెట్ దొరికేతే తప్పనిసరిగా తినాలని నిపుణులు చెబుతున్న మాట.

Also Read:తొలిసారి ఎంపీ..కేంద్రమంత్రిగా ఛాన్స్

- Advertisement -