కృష్ణజింకల కేసు…సల్మాన్‌కు ఐదేళ్ల జైలు

379
Black buck poaching case
- Advertisement -

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల కేసులో ముద్దాయిగా తేల్చింది రాజస్థాన్‌ జోథ్‌పూర్‌ కోర్టు. 20 ఏళ్ల పాటు సాగిన ఈ కేసులో సల్మాన్‌ను దోషిగా తేలుస్తు సంచలన తీర్పు వెలువరించింది. సల్మాన్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధించింది.సల్మాన్ తో పాటు కేసులో ముద్దాయిలుగా ఉన్న సైఫ్ అలీఖాన్, టబు, సొనాలి బింద్రేలు కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే సల్మాన్ ను దోషిగా తేల్చిన న్యాయస్ధానం మిగితా వారిని నిర్దోషులుగా ప్రకటించింది. కేసు తీర్పు నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

1998లో ‘హమ్ సాత్ సాత్ హైన్’ సినిమా షూటింగ్ సందర్భంగా జోథ్‌పూర్‌లోని కంకణి గ్రామంలో.. సల్మాన్, సైఫ్ అలీ ఖాన్, సొనాలీ బింద్రే, టబు, నీలమ్.. స్థానికుల సహాయంతో కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదైంది. దాదాపు 20 ఏళ్ల పాటు సాగిన ఈ కేసులో మార్చి 28న వాదనలు ముగిశాయి.

ఇక ఈ కేసుకు సంబంధించి సల్మాన్ పై సెక్షన్-51 వన్య ప్రాణి సంరక్షణ చట్టం, సెక్షన్ 149-చట్ట విరుద్ద కార్యకలాపాలపై కేసులు నమోదయ్యాయి. ఇక సల్మాన్‌కు జైలు శిక్ష ఖరారైతే జైల్లో పెట్టడానికి జోధ్‌పూర్‌ జైలు అధికారులు ముందుగానే ఓ కారాగారాన్ని సిద్ధం చేశారు. కారాగారంలో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయబోమని వెల్లడించారు.

- Advertisement -