బీజేపీలో టికెట్ల రచ్చ.. కీలక నేతలు గుడ్‌బై..?

43
- Advertisement -

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం మాదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా ఆ పార్టీ నేతలు పదే పదే ప్రగల్భాలు పలుకుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగామని, వచ్చే ఎన్నికల్లో ఏకంగా 80 సీట్లు గెలుస్తామంటూ తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్‌తో సహా రఘునందన్‌రావు వంటి బీజేపీ నేతలు పదేపదే బిల్డప్ ఇస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అసలు సీన్ వేరే ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 107 సీట్లలో బీజేపీ డిపాజిట్ గల్లంతు అయింది. బీజేపీకి నాయకులే తప్పా..పెద్దగా క్యాడర్ లేదు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ నిర్మాణం ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. క్యాడర్ చాలా తక్కువ..ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత వరుసగా కాంగ్రెస్ నేతలు జాయిన్ అయినా…నాయకులు వచ్చారే తప్పా…వారి వెంట పెద్దగా క్యాడర్ రాలేదు. టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్‌తో ఇద్దరు, ముగ్గురు నాయకులు పార్టీలో చేరినా…కార్యకర్తలు మాత్రం ఎవరూ బీజేపీకి వెళ్లలేదు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగామని బండి బ్యాచ్ చెబుతుంది కానీ ఇప్పటికీ 40 నియోజకవర్గాల్లో తప్పా…మిగిలిన 79 నియోజకవర్గాల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ నాయకులు లేరు. కార్యకర్తలు అసలే లేరు. గ్రౌండ్‌ లెవల్లో పార్టీని బలోపేతం చేయకుండా.. నియోజకవర్గాలకు ఒక ముఖ్య నాయకుడిని తయారు చేసుకోకుండా అధికారంలోకి వచ్చేస్తామని బండి బ్యాచ్ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంది.

అయితే గ్రౌండ్ లెవెల్‌లో పార్టీని బలోపేతం చేయకుండా ఎలా అధికారంలోకి వస్తామని నేతలు బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టి ఇంఛార్జ్‌ను ప్రకటించాలని.. అభ్యర్థిపై క్లారిటీ ఇవ్వాలని కేడర్‌ ఒత్తిడి చేస్తోంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని మెజారిటీ సెగ్మెంట్లకు బీజేపీ నుంచి ఫలానా నాయకుడు పోటీ చేస్తారనే క్లారిటీ లేదు. బీజేపీలో ముందుగా అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం లేకపోవచ్చు కాని….అనధికారికంగానైనా ఫలానా నేత ఎమ్మెల్యే అభ్యర్థి అని చెబితే మంచిదని, ఆయన గెలుపు కోసం పని చేసే టైమ్ దొరుకుతుందని క్యాడర్ వాదన. . కానీ ముందస్తుగానే బీజేపీ అభ్యర్థిని ప్రకటించే ధైర్యం బీజేపీ పెద్దలకు లేకుండాపోయింది. ఈ వైఖరే బీజేపీలోకి వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులకు.. వారి అనుచరులకు మింగుడు పడటం లేదు. కమలం గుర్తుపై పోటీ చేసే ఆలోచనతో బీజేపీలో చేరిన నాయకులు అనేకమంది. అలాంటి వారిలో చాలా మంది తమ రాజకీయ భవిష్యత్‌పై అభద్రతా భావంతో నలిగిపోతున్నారంట.. టికెట్‌పై క్లారిటీ లేకపోవడం.. నమ్మకం ఇచ్చే పెద్దలు లేక టెన్షన్‌ పడుతున్నారట. దాంతో పార్టీ కార్యక్రమాలకు కొందరు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. కొన్నిచోట్ల తమకు తెలియకుండానే తమకన్నా తక్కువస్థాయి నేతలను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని.. వారికి ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలో ఉన్నారని గుర్రుగా ఉన్నారట. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరికి వారే తామే అభ్యర్థులమని ప్రచారం చేసేసుకుంటున్నారు.

దీంతో టికెట్‌ ఆశించి బీజేపీలోకి వచ్చిన పెద్దలకు అది రుచించడం లేదట. కాషాయ కండువా కప్పుకొన్న సమయంలో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం వలస నేతల్లో కనిపించడం లేదంట…. సన్నిహితులు కలిసినప్పుడు.. ఆంతరంగిక సమావేశాల్లోనూ భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. బీజేపీ పెద్దల నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఇప్పుడే తమ దారి చూసుకోవడం బెటర్‌ అనే అభిప్రాయంలో ఉన్నట్టు కాషాయ పార్టీలో టాక్‌ నడుస్తుందంట..కాగా బీజేపీలో నెలకొన్న పరిణామాలు కొత్తగా బీజేపీకి వచ్చే వారికి బ్రేక్‌లు వేస్తున్నాయట. ఈ మధ్య బీజేపీలో చేరికలు తగ్గిపోవడానికి అదే కారణమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అభ్యర్థి ఎవరో డైరెక్ట్‌గా చెప్పకపోయినా..అంతర్గతంగా చెప్పేస్తే.. నియోజకవర్గాల్లో పనిచేసుకుంటామని.. స్థానికంగా చేరికలు ఊపందుకుంటాయని పార్టీ నేతల దగ్గర ప్రస్తావిస్తున్నారట. అలా కాకుండా టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టేందుకు ఎన్నికల వరకు టికెట్ల విషయమై నాన్చి, చివరల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని రాష్ట్రనాయకత్వాన్ని హెచ్చరిస్తున్నారంట..మొత్తంగా ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నా…బీజేపీలో ఇప్పటి నుంచే టికెట్ల రచ్చ మొదలవడంతో బండి సంజయ్‌కు తలనొప్పిగా మారిందనే చెప్పాలి.

- Advertisement -