తెలంగాణ బీజేపీ లోక్ సభ ఎన్నికలపై గట్టిగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ ఘోరంగా విఫలం అయిన తర్వాత అమిత్ షా రాష్ట్రంలో పర్యటించి పార్టీ పరిస్థితులను సమీక్షించారు. ముఖ్యంగా పార్టీలో అంతర్గతంగా ముసులుకున్న విభేదాల కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణమని అంచనాకు వచ్చిన అమిత్ షా, నేతల మద్య దూరం తగ్గించే బాద్యతను కిషన్ రెడ్డి భుజాన వేశారు. ముఖ్యంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ మద్య ఉన్న కోల్డ్ వార్ కారణంగానే బీజేపీ డీలా పడుతోందనేది చాలమంది అభిప్రాయం. వారిద్దరి మద్య దూరం తగ్గించి ఒకే తాటిపైకి తీసుకోచ్చేందుకు పార్టీలో ముమ్మర ప్రయత్నలే జరుగుతున్నాయి. ఇక లోక్ సభ ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో నేతల మద్య అంతరం తగ్గిస్తూనే జిల్లాల వారీగా పార్టీ బలా బలహీనతలపై కూడా దృష్టి సారిస్తున్నారు కమలనాథులు.
అందులో భాగంగానే జిల్లాల వారీగా అధ్యక్షుల మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నాట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమై ప్రక్షాళనపై దృష్టి సారిస్తున్నాట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన వైఫల్యాలను అధిగమించి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటే దిశగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తరువాత జిల్లాల వారీగా యాక్టివ్ గా లేని అధ్యక్షుల జాబితాను బట్టి మార్పులు చేర్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే అయితే పార్టీకి సంబంధించిన ఇలాంటి కీలక వ్యవహారాల్లో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఈటెల రాజేందర్ వంటివారి పాత్ర ఎంతమేర ఉండబోతుందనేది ప్రశ్నార్థకమే. మరి ముందు రోజుల్లో కమలం పార్టీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.
Also Read:ఈ లక్షణాలు ఉంటే..కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లే!