ఏపీలో బీజేపీ వైసీపీ మద్య అనధికారిక పొత్తు ఉందని ఆ రాష్ట్ర పోలిటికల్ సర్కిల్స్ లో ఎంతో కాలంగా వినిపిస్తున్న మాట. అయితే ఈ విషయంపై అటు వైసీపీ గాని, బీజేపీ గాని ఎప్పుడు కన్ఫర్మ్ చేయలేదు. అయితే వైసీపీపై రాష్ట్ర బీజేపీ నేతలు అడపా దడప విమర్శలు చేస్తున్నప్పటికి, వైసీపీ నేతలు మాత్రం బీజేపీ పై గాని మోడీ సర్కార్ పై గాని మొన్నటి వరకు ఎలాంటి విమర్శలు చేయకపోగా కేంద్ర ప్రబుత్వ విధానాలకు మద్దతు పలుకుతూ వచ్చింది. కానీ ఆ మద్య ఏపీ వచ్చిన బీజేపీ ఆగ్రనేతలు నడ్డా, అమిత్ షా వంటి వారు జగన్ పై ఆయన పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. .
దాంతో ఊహించని ఈ హటాత్పరిణామానికి షాక్ అయిన జగన్.. ఇక బీజేపీ బహుశా తమతో ఉండకపోవచ్చని స్టేట్ మెంట్ ఇచ్చారు. దాంతో బీజేపీ వైసీపీ మద్య ఎలాంటి అంతర్గత పొత్తుకు తావులేదేమో అని భావించారంతా. కానీ ఎన్ని జరిగిన బీజేపీ వెంటే వైసీపీ అన్నట్లుగా మళ్ళీ బీజేపీకి మద్దతుగా నిలుస్తోంది వైసీపీ. ఇటీవల జరిగిన మణిపూర్ ఘటన చర్చకు రావాలని లోక్ సభలో విపక్షాలన్నీ ఏకమై మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్డీయేలోని పార్టీలు తప్పా మిగిలిన అన్నీ పార్టీలు అవిశ్వాస తీర్మాననానికి మద్దతు తెలిపాయి. అయితే ఎన్డీయేలో లేని వైసీపీ మాత్రం బీజేపీకె మద్దతు తెలిపింది.
Also Read:బ్రో అదిరింది.. కానీ అవే మైనస్
కేంద్రంలో మోడీ పాలన మెరుగ్గా ఉందని అవిశ్వాస తీర్మానం పెట్టవలసిన అవసరం లేదని, తాము అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉంటామని వైసీపీ స్పష్టం చేసింది. దీన్ని బట్టి బీజేపీ స్నేహబంధాన్ని వైసీపీ కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరి బీజేపీ తమతో లేదని, కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందని ఈ మద్య గళం వినిపిస్తున్న వైసీపీ.. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపకపోవడంతో అవన్నీ ఒట్టి మాటలేనా రాజకీయ అతివాదులు జగన్ సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బీజేపీ వెంటే వైసీపీ అనే సంగతి తాజా పరిణామాలతో మరోసారి రుజువైందనే చెప్పాలి.
Also Read:మొక్కజొన్న పొత్తులు తింటున్నారా..!