ఉప ఎన్నికలు..బీజేపీ వరెస్ట్ స్ట్రాటజీ

67
Raghunandhan rao
- Advertisement -

దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదొస్తూ రాక్షసానందం పొందుతున్న కాషాయ నేతల కళ్లు తెలంగాణపై పడింది. అయితే ఇక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు పాచిక పారకపోవడంతో అబద్దపు మాటలు,అసత్య ప్రచారాలు, మత విద్వేశాలను రెచ్చగొడుతూ లబ్దిపొందాలని చూస్తున్నారు పువ్వు పార్టీ నేతలు.

ఎన్నికలకు ఇంకా ఏడాదే ఉండటంతో మిడతల దండు దండయాత్ర చేసినట్లుగా కేంద్రమంత్రుల దగ్గరి నుండి వివిధ రాష్ట్రాల సీఎంలు పర్యటిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. అసలు తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేకపోగా అన్ని తామే చేస్తున్నట్లు కటింగ్ ఇస్తూ విషప్రచారం చేస్తున్నారు.

బీజేపీ స్ట్రాటజీలో భాగంగా వచ్చిన ఉప ఎన్నికలే మనుగోడు బై ఎలక్షన్స్‌. ఓ వ్యక్తి స్వార్ధం కోసం ఈ ఎన్నికలు రాగా ఇంతవరకు మునుగోడు అభివృద్ధి దృష్టిసారించని రాజగోపాల్ రెడ్డి..ఆత్మగౌరవం అంటూ దొంగనాటకాలకు తెరలేపారు. దీనికి తోడు ఆ పార్టీ ఐటీ సెల్‌ ఉండనే ఉంది కదా గోబెల్స్‌ ప్రచారానికి. లేనది జరిగినట్లు రేపేదో అద్బుతం జరగనున్నట్లు పోస్టింగ్స్‌ చేస్తుండగా నెటిజన్లు మాత్రం పువ్వుపార్టీ నేతలను ఏకీపారేస్తున్నారు.

ఇందులో భాగంగా ఎన్నో హ‌మీల‌తో దుబ్బాక‌, హుజురాబాద్ ఉప ఎన్నిక‌లను గెలుచుకుంది. రాష్ట్ర ప్ర‌భుత్వంతో నిమిత్తం లేకుండా కేంద్ర నిధుల‌తో నియోజక‌వ‌ర్గాన్ని అభివ్రుద్ది చేస్తామ‌ని హ‌మీల వ‌ర్షం కురిపించింది. నమ్మిన జ‌నం బీజేపీని గెలిపించారు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పాలని ఎదురుదాడికి దిగుతున్నారు నెటిజన్లు.

ప్ర‌తి రైతు కుటుంబానికి వ్య‌వసాయ ప‌నుల నిమిత్తం రెండు ఎద్దులు, ఒక నాగ‌లి ఇస్తామ‌ని ర‌ఘునంద‌న్ రావు హ‌మీ ఇచ్చారు. కాని ఇప్ప‌టికైతే దున్న‌కానికి ఎద్దులు రాలేదు. కేంద్రం త‌రుఫున ప్ర‌తి నిరుద్యోగికి నెల‌కు మూడు వేల నిరుద్యోగ భ్రుతి ఇస్తామ‌ని బీజేపీ హ‌మీ ఇచ్చింది. కాని ఇప్ప‌టికైతే భ్రుతి నిరుద్యోగికి అంద‌లేదు. మోడి స‌ర్కార్ ద్వారా ప్ర‌తి పంట‌కు అవ‌స‌ర‌మైన ఎరువుల‌ను ఉచితంగా పంపిణి చేస్తాం. ఉచితం మాట దెవుడెరుగు ఎరువుల ధ‌ర‌లైతే భారిగా పెంచారని గుర్తు చేస్తున్నారు.

దుబ్బాక ప‌ట్ట‌ణానికి కేంద్ర నిధుల ద్వారా ఔట‌ర్ రింగ్ రొడ్డు నిర్మిస్తామన్న హ‌మీ అమ‌లుకు నోచు కోలేదు… నిరుపేద అమ్మాయిల వివాహానికి పుస్తే, మ‌ట్టెలు, ఒక జ‌త బ‌ట్ట‌లు ఇస్తామ‌న్న హ‌మీ అమ‌లు కాలేదు. దుబ్బాక నియోజ‌వ‌ర్గ అభివ్రుద్ది కోసం బీజేపీ ఇచ్చిన‌ 16 హ‌మీలు మానిఫెస్టో కాగితాల‌కే ప‌రిమితం అయ్యాయి త‌ప్ప కార్య‌చ‌ర‌ణ‌కు నోచు కోలేదని స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -