దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు..

178
bjp won
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో అనూహ్య రీతిలో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1068 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దుబ్బాకలో బీజేపీ గెలుపుతో తెలంగాణ వచ్చిన తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి టీఆర్ఎస్ ఓడిపోయినట్టు అయ్యింది.

దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ సందర్బంగా మొదటి నుంచి వెనుకబడి ఉన్న టీఆర్ఎస్.. 19వ రౌండ్‌ ముగిసే సమయానికి 250 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యత సాధించడంతో.. ఆ తరువాత ఇదే రకంగా ఫలితాలు ఉంటాయేమో అని అంతా అనుకున్నారు. కానీ 20వ రౌండ్ నుంచి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చిన బీజేపీ.. 23వ రౌండ్ వరకు ఆ ఆధిక్యతను నిలబెట్టుకుని దుబ్బాక ఉఫ ఎన్నికల్లో విజయం సాధించింది.

ఈ ఉప ఎన్నిక‌లో మొత్తం 1,64,186 ఓట్లు పోల‌వ్వ‌గా, బీజేపీకి 62,772, టీఆర్ఎస్ పార్టీకి 61,302, కాంగ్రెస్ పార్టీకి 21,819 ఓట్లు పోల‌య్యాయి. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 1453 పోల‌వ్వ‌గా, అందులో 1381 ఓట్లు మాత్ర‌మే చెల్లుబాటు అయ్యాయి. చెల్లుబాటైన ఓట్ల‌లో టీఆర్ఎస్ పార్టీకి 720, బీజేపీకి 368, కాంగ్రెస్ పార్టీకి 142 ఓట్లు పోల‌య్యాయి. స్వ‌తంత్ర అభ్య‌ర్థి బండారు నాగ‌రాజుకు 60 ఓట్లు వ‌చ్చిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు.

- Advertisement -