బీజేపీ గద్దలను గద్దె దింపుదాం: కేసీఆర్‌

51
kcr
- Advertisement -

కేంద్రంలోని బీజేపీ అవినీతి గ‌ద్ద‌ల‌ను గ‌ద్దె దించి.. వారి నుంచి ఈ దేశానికి విముక్తి ప‌లుకాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. గుజ‌రాత్ మోడ‌ల్ అని చెప్పి ఈ దేశాన్ని మోసం చేశార‌ని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. పెద్ద‌ప‌ల్లి జిల్లాలో స‌మీకృత క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం ప్ర‌సంగించారు. అంతకు ముందు కలెక్టరేట్‌ వద్ద జిల్లా పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కేంద్రంలోని పెద్దకల్వల ఎస్సారెస్పీ క్యాంపు స్థలంలో 22 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో భవనాన్ని రూ.48.07 కోట్ల వ్యయంతో కలెక్టరేట్‌ భవనంను ఏర్పాటు చేశారు.

 

పెద్ద‌ప‌ల్లి జిల్లా అవుతుంద‌ని మ‌నం క‌ళ‌లో కూడా అనుకోలేదు. తెలంగాణ ఏర్ప‌డ్డ‌ది కాబ‌ట్టి పెద్ద‌ప‌ల్లిని జిల్లా చేసుకున్నాం. అద్భుత‌మైన క‌లెక్ట‌రేట్‌ను ఏర్పాటు చేసుకున్నాం. జిల్లా ప్ర‌జాప్ర‌తినిధుల‌ను, అధికార యంత్రాంగాన్ని, ప్ర‌జ‌లంద‌రినీ హృద‌య‌పూర్వంగా అభినందిస్తున్నాను. చాలా మంచి కార్య‌క్ర‌మాలు చేసుకున్నాం. పేద‌లు, రైతులు, ప్ర‌జ‌లు, మ‌హిళ‌లు గురించి మంచి కార్య‌క్ర‌మాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. భార‌త‌దేశ‌మే ఆశ్చ‌ర్య‌పోయే విధంగా.. అద్భుత‌మైన ప‌ద్ధ‌తిలో మ‌నం ముందుకు వెళ్తున్నామ‌ని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతం గురించి మీకు తెలుసు. సింగ‌రేణిలో వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు దొర‌కుతున్నాయి. దేశంలో ఎక్క‌డా ఇవ్వ‌ని విధంగా సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్ ఇస్తున్నాం. రామ‌గుండం ప‌ట్ట‌ణాన్ని కార్పొరేష‌న్ చేసుకున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఏ విధ‌మైన కార్య‌క్ర‌మాలు అమ‌ల‌వుతున్నాయో మీకు తెలుసు అని కేసీఆర్ తెలిపారు.

గుజ‌రాత్ మోడ‌ల్ అని చెప్పి దేశ ప్ర‌జ‌ల‌ను ఈ మోదీ ద‌గా, మోసం చేశార‌ని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. అడ్డ‌గోలుగా ధ‌ర‌లు పెంచారు. స్మ‌శానాల మీద ప‌న్ను, పాల‌మీద జీఎస్టీ, చేనేత మీద జీఎస్టీ, పేద ప్ర‌జ‌లు ఉసురుపోసుకుంటూ.. ల‌క్ష‌ల రూపాయాలు మేస్తూ బీజేపీ అవినీతి గ‌ద్ద‌లు దేశాన్ని మోసం చేస్తున్నాయి. కొన్ని స‌న్నివేశాలు స్వ‌యంగా చూస్తున్నాం. గాంధీ పుట్టిన రాష్ట్రంలో మ‌ద్య‌పానం నిషేధం చేశామ‌ని చెప్తారు. ప్ర‌ధాని మోదీ సొంత రాష్ట్రంలో క‌ల్తీ మ‌ద్యానికి 79 మంది బ‌ల‌య్యారు. అక్క‌డ‌ క‌ల్తీ మ‌ద్యం ఏరులై పారుతోంది. దీని మీ స‌మాధానం ఏంట‌ని అడుగుతున్నాను అని మోదీని ఉద్దేశించి కేసీఆర్ ప్ర‌శ్నించారు.

 

తెలంగాణ రైతాంగంపై చేపట్టిన సంక్షేమ పథకాలు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోని రైతులు కావాలని అడుగుతున్నారు. నిన్న గాక మొన్న 26 రాష్ట్రాల నుంచి దాదాపు 100 మంది రైతు నాయ‌కులు తెలంగాణకు వ‌చ్చారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌ను చూశాం. రైతుల‌తో మాట్లాడం. ఈ రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న కార్య‌క్ర‌మాలు మా ద‌గ్గ‌ర అమ‌లు కావ‌డం లేదు. జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆహ్వానించారు. జాతీయ రాజ‌కీయాల్లోకి పోదామా? అని స‌భ‌లో ఉన్న జ‌నాల‌ను కేసీఆర్ ప్ర‌శ్నించారు.

 

- Advertisement -