రాజాసింగ్ పై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైంది బీజేపీ. పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పట్ల బీజేపీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్ష్య పదవికి పోటీచేసేందుకు నామినేషన్ పత్రం ఇచ్చినా, అతను నామినేషన్ దాఖలు చేయకుండా పార్టీపై తీవ్ర విమర్శలు చేసినందుకు రాజాసింగ్ పట్ల సీరియస్‌గా ఉంది బీజేపీ హైకమాండ్.
రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తూ, అతనిపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు లేఖ రాసేందుకు సిద్ధమైంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు పేరును ఖరారు చేయడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు రాజాసింగ్.
తెలంగాణ బీజేపీలో కొందరు బడా నాయకులు పార్టీని నాశనం చేస్తున్నారు …పార్టీకోసం కష్టపడిన వాడిగా నా కళ్ళముందే పార్టీ నాశనం అవడం చూడలేక రాజీనామా చేశాను అని తెలిపారు. అణచివేతను భరించే శక్తి ఇక నాకు లేదు అన్నారు.

