ఎన్టీఆర్ లేదా మెగాస్టార్.. హీరోయిజం కోసం బీజేపీ తాపత్రయం !

144
jr ntr
- Advertisement -

బీజేపీకి స్టార్లు కావాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హీరోల భుజాల పై తమ పార్టీ భవిష్యత్తును పెట్టేయాలని బీజేపీ పెద్దలు కంకణం కట్టుకున్నారు. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండడం లేదు. అసలెందుకు ? ఆధారకంలో ఉన్న బీజేపీ పార్టీ.. సడెన్ గా హీరోల పై పడింది ? అని నెటిజన్లు కామెంట్లు చేసున్నారు. కారణం ఒక్కటే.. సౌత్ లో ఎంజీఆర్, ఎన్టీఆర్ పుణ్యమా అని హీరోల రాజకీయాలకు గిరాకీ పెరిగింది. అందుకే.. స్వతహాగా బలం లేని బీజేపీ.. హీరోయిజం పై తమ పునాదులు వేసుకోవాలని ఆశ పడుతుంది. గతంలో తన తాత సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని అందుకోవాలని ఆసక్తి చూపించిన జూనియర్ ఎన్టీఆర్ కి రాజకీయ లైఫ్ ఇస్తామన్న సంకేతాలను బీజేపీ చాలా కాలంగా పంపుతోంది. అమిత్ షా ఎన్టీఆర్ ని కలిసినా.. కన్నడ బీజేపీ ఎన్టీఆర్ కి ప్రత్యేక ఆహ్వానం పంపినా ముఖ్య కారణం.. జూ.ఎన్టీఆర్ ని తమ వాడికి చేసుకునేందుకే. ఎన్టీఆర్ ఏ మాత్రం మొగ్గు చూపినా.. బీజేపీ అగ్రనాయకత్వం అక్కున చేర్చుకోవాలని ముచ్చట పడింది. కానీ, నటనే కాదు.. రాజకీయాన్ని సైతం వంట బట్టించుకున్న జూ.ఎన్టీఆర్ తెలివి ముందు.. బీజేపీ పాచికలు పారలేదు.

కట్ చేస్తే.. సీన్ లోకి మెగాస్టార్ వచ్చారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల కోసం చిరంజీవిని ఆకర్షించేద్దామని ఆశ పడ్డారు. రాజకీయాల్లో కూడా చిరంజీవిగా వెలిగిపోవాలని గతంలో పార్టీ పెట్టి తప్పిదాలు చేసి సైలెంట్ అయిపోయిన మెగాస్టార్ ని మళ్లీ యాక్టివ్ గా చేయాలని బీజేపీ ప్లాన్ చేసింది. అందుకే, సడెన్ గా ఓ అవార్డు ప్రకటించి..ఇక వచ్చేయ్ అన్నట్టు సైగలు చేసింది. మరి మురిసిపోయిన చిరంజీవి.. బీజేపీ తెర పై నటించగలరా ? డౌటే. నిజానికి మెగాస్టార్ కి రాజకీయాల పై ఆసక్తి పోయింది. దీనికితోడు చిరుకి చాలా పరిమితులు ఉన్నాయి. అన్నిటికీ మించి తన తమ్ముడు పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ పెట్టి పోరాడుతున్నాడు. పైగా చిరు పవన్ కి తన సంపూర్ణ మద్దతు ప్రకటించాడు కూడా. కాబట్టి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీలోకి చిరు చేరడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అసలు చిరంజీవి అయినా కావొచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అయినా కావొచ్చు. బీజేపీ ఎదగడానికి తమ కెరీర్ ను పనంగా పెట్టి ఎందుకు పని చేస్తారు ?, కానీ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదగాలంటే… స్టార్ వాల్యూ కావాలి. మరి ఆ వాల్యూ దొరికేది ఎన్నడూ !!.

ఇవి కూడా చదవండి..

- Advertisement -