తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా పావులు కడుపుతోంది. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధిచాలని పట్టుదలగా ఉంది. జాతీయ నాయకత్వం కూడా ఈసారి తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తరచూ రాష్ట్ర నేతలతో భేటీలు నిర్వహిస్తూ పార్టీ స్థితిగతుల గురించి అరా తీస్తున్నారు. కాగా ఇటీవల పార్టీలో సంస్థాగత మార్పులు చేసిన అధిష్టానం.. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో కూడా ఎంతో జాగ్రత్త వహిస్తోంది. కర్నాటక ఎన్నికల్లో ఓటమి తరువాత తెలంగాణలో ఆ పరిస్థితి రాకూడదని అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తోంది. తాజాగా ఎన్నికల బరిలో నిలిచే 30 అభ్యర్తులను అధిష్టానం కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read:ఆ హీరోయిన్ని ఎలా తప్పు పట్టగలం?
ఆ లిస్ట్ లో బీజేపీలోని ప్రతి నేత ఉన్నట్లు టాక్. ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం అయిన అమిత్ షా ప్రతిఒక్కరు ఎన్నికల బరిలో నిలవాలని సూచించరాట. అందుకు తగ్గట్టుగానే బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్ ఈటెల రాజేందర్ వంటి వారితో పాటు ఇటీవల పార్టీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, డికె అరుణ, జయసుధ వంటి వారికి కూడా టికెట్ ఇచ్చే బరిలో నిలిపే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం పార్టీలో పెద్దగా చేరికలు జరగక పోవడంతో.. ముందు ఉన్నవారికి సీట్లు కేటాయింపు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా చాలా నియోజిక వార్గాలలో కమలం పార్టీకి బలమైన అభ్యర్థులు లేరనేది ఆ పార్టీకి కూడా బాగా తెలుసు. ఈ నేపథ్యంలో అధికార బిఆర్‌ఎస్ కు పోటీనిచ్చే విధంగా అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం. మొత్తానికి కర్నాటక ఎన్నికల తరువాత.. గెలుగు విషయంలో ఆ పార్టీకి మునుపటి కాన్ఫిడెంట్ లేదనేది వాస్తవం.
Also Read:ముగిసిన బీఏసీ..3 రోజులు అసెంబ్లీ సమావేశాలు