సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జాతీయ కార్యవర్గ సభ్యుల భేటీ సోమవారం ఏపీ, తిరుపతిలో జరిగింది. ఏపీలో పార్టీ బలోపేతంపై ఈ భేటీలో వాడివేడి చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలకు అమిత్ షా పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. ఈ భేటీలో ఏపీ బీజేపీ ఛీఫ్ శ్రీసోము వీర్రాజు, బీజేపీ జాతీయ నాయకురాలు పురందేశ్వరీ పలువురు నాయకులు పాల్గొన్నారు.
అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో బీజేపీ ఛీఫ్ శ్రీసోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం ఉండటంతో 2024లో అధికారం దిశగా అడుగులేయాలని అమిత్ షా మాకు దిశా నిర్దేశం చేశారు. ఏపీలో ముఖ్యమైన నేతలను బీజేపీలో చేర్చుకుని 2024లో ఏపీలో అధికారం దిశగా కార్యచరణ రూపొందించుకుంటాం. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీజేపీ కృషి చేస్తుంది అన్నారు. ఏపీలో గ్రామీణాభివృద్ధికి సహకారమందిస్తామని అమిత్ షా చెప్పారని సోము వీర్రాజు తెలిపారు.
బీజేపీ జాతీయ నాయకురాలు పురందేశ్వరీ మాట్లాడుతూ.. ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుంది.. బీజేపీ ప్రజావాణి కావాలని అమిత్ షా దిశా నిర్దేశం చేశాం..ఏపీలో బీజేపీ బలోపేతం, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై అమిత్ షాతో సుధీర్ఘంగా చర్చించామన్నారు. ఏపీ విభజన బిల్లు అంశాలపై అమిత్ షాతో చర్చించాం.. విభజన బిల్లులోని 80 శాతానికి పైగా అంశాలు ఇప్పటికే కేంద్రం నెరవేర్చింది. మిగిలిన అంశాలపై కూడా చర్చించాం.. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదు.. దీనిపై కుడా పోరాటం చేస్తామని పురంధీశ్వరీ తెలిపారు.

