తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. కాగా, తెలంగాణ బీజేపీ ఆదివారం తమ బీజేపీ మేనిఫెస్టోను ప్రకటింటించింది. ఈ నెల 20 నుంచి బీజేపీ పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి దిగనుంది. కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతలు, స్టార్ క్యాంపెయినర్లు తెలంగాణలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మేనిఫెస్టో దాదాపు 11 అంశాలను వెల్లడించింది.
బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ఇవే:
1.ఉపాధి హామీ కూలీలకు ఉచిత అల్పాహారం.
2.కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేసి సాగునీరు అందిస్తాం.
3.గోదావరి జలాల సద్వినియోగానికి 9 బ్యారేజీలు నిర్మిస్తాం.
4.ప్రతి పేద కుటుంబానికి రూ.5లక్షల ఆరోగ్య బీమా.
5.అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
6.గొర్రెల పెంపకందారుల సబ్సిడీని 20 వేల నుంచి 50 వేలకు పెంచుతాం.
7.ఉచితంగా విద్యార్థులకు సైకిళ్లు, కాలేజీ విద్యార్థులకు స్కూటీలిస్తాం.
8.డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు.
9.మూడు నెలల్లో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తాం.
10.రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ.
11.ఇళ్లులేని పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తాం.