హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. బిల్డర్‌కు సంబంధించిన వాచ్‌మెన్‌పై చేయి చేసుకున్నాడని పోచారం పీఎస్‌లో ఈటెల రాజేందర్‌పై కేసులు నమోదు చేశారు పోచారం పోలీసులు.
పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన ఈటల రాజేందర్ పిటిషన్ దాఖలు చేశారు.
గ్యార ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు. ఔ 126(2), 115(2), 352,351(2), r/w 189(2), r/w 191(2) BNS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. ఏకశిలా నగర్లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్‌తో పాటు 30 మంది దాడి చేశారంటూ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. నేపథ్యంలో కేసు ఫైల్ అయింది.
Also Read:ISRO:సెంచరీ కొట్టేందుకు ఇస్రో రెడీ
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారంలోని ఏకశిలానగర్‌లో పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈటల దాడితో చేయడంతో పక్కనే ఉన్న బీజేపీ నేతలు సైతం చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.