తెలంగాణ బీజేపీలో అసంతృప్తి సెగలు..

175
rajasingh

తెలంగాణ బీజేపీలో అసంతృప్తి రాజుకుంది. పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించిన రెండు రోజులకే ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌…రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు వాట్సాప్ ద్వారా తన అసంతృప్తిని వెల్లగక్కారు.

బీజేపీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను…ఫ్లోర్ లీడర్‌ని కానీ రాష్ట్ర కమిటీ ఏర్పాటులో తన అభిప్రాయం తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా గ్రూపు రాజకీయాలు ఆపాలని సూచించిన రాజాసింగ్….బీజేపీలో నన్ను మరోసారి పక్కకు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన నియోజకవర్గం నుండి ఒక్కరికి రాష్ట్రకమిటీలో చోటు ఇవ్వలేదు… గోషామహాల్ అధ్యక్షుడిని ఎన్నుకునే స్వేచ్ఛ కూడా తనకు లేదన్నారు. రెండు సార్లు తన గెలుపుకోసం పార్టీ కార్యకర్తలు,నాయకులు పనిచేశారు..వారికి రాష్ట్రకమిటీలో చోటు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. మీ నాయకత్వంపై నమ్మకంతో ఉన్నానని కానీ ఇప్పటివరకు ఒక్కటి సాకారం కాలేదని తెలిపారు.