సీఎం రేవంత్‌కు రాజాసింగ్ బహిరంగ లేఖ

5
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగ లేఖ రాశారు. ఏప్రిల్ 6న శ్రీరాముడి శోభ యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరారు ఎమ్మెల్యే రాజాసింగ్.శోభాయాత్రలో సౌండ్ సిస్టం తక్కువ వాడాలంటూ నగర కమిషనర్ సివి ఆనంద్ తెలపటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు రాజాసింగ్.

గత 15 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇలాంటి ఆంక్షలు లేవని ఇప్పుడు కొత్తగా నగర కమిషనర్ సౌండ్ సిస్టం తగ్గించుకోవాలని చెప్పటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.ఎంఐఎం నేతలు పెద్దపెద్ద డీజే లతో సౌండ్ పొల్యూషన్ చేసిన వారిని చూసి చూడనట్టుగా వదిలేసిందని ఇప్పుడు శ్రీరామ భక్తులపై ఇలాంటి ఆంక్షలు ఎందుకని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు రాజాసింగ్.

ఎలాంటి ఆంక్షలు లేకుండా రాముడు శోభాయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరారు. శ్రీరాముడి శోభాయాత్రలో మీరు కూడా పాల్గొనాలని కోరారు రాజాసింగ్. ఆకాష్ పూరి హనుమాన్ మందిర్ నుంచి దూల్పేట్ హెచ్ వి ఎస్ పబ్లిక్ స్కూల్ సుల్తాన్ బజార్ మీదుగా గోషామహల్ లో కొనసాగనుంది శ్రీరాముని శోభాయాత్ర.

- Advertisement -