- Advertisement -
అమర్‌నాథ్ యాత్రలో వరదల వల్ల పదుల సంఖ్యలో మరణించగా మరికొంతమంది గల్లంతయ్యారు. ఇక ఈ యాత్రలో వరదల నుండి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తృటిలో తప్పించుకున్నారు.
దీనిపై స్పందించిన రాజాసింగ్…ప్రజల ఆశీర్వాదం వల్లే నేను, నా కుటుంబం బతికి బయటపడ్డాం అన్నారు. ఇలాంటి వరదలను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. మిలిటరీ అధికారుల సేవల వల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరగలేదని తెలిపారు.
ప్రస్తుతం తమ కుటుంబం శ్రీనగర్‌లో సురక్షితంగా ఉందని తెలిపారు.
- Advertisement -

