ఉత్తరాఖండ్ ఖాన్పూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ చేసిన ఓ నిర్వాకం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.. ఈ ప్రబుద్దుడు ఇటీవలే తన కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సంతోషంలో తన అనుచరులతో కలిసి డెహ్రాడూన్ లోని ఓ హోటల్లో ఎంజాయ్ చేశారు. మద్యం సేవిస్తూ, ఓ బాలీవుడ్ పాటకు ప్రణవ్ చిందేశారు.
అయితే, మందేసి, చిందేసిన ప్రణవ్ తన తుపాకులను చేతిలో పెట్టుకుని ప్రదర్శించడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలకు చేరడంతో ఈ విషయం బయటపడింది. దీనిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రణవ్ ను పార్టీ నుంచి కొన్ని నెలల పాటు బహిష్కరించారు. మరోమారు వివాదంలో చిక్కుకున్న ప్రణవ్ పై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
BJP MLA Pranav Champion who was recently suspended from the party for threatening a journalist, seen in a viral video brandishing guns. Police says, "will look into the matter and also verify if the weapons are licensed or not." (Note: Abusive language) pic.twitter.com/AbsApoYR2g
— ANI (@ANI) July 10, 2019