అధికార దాహంతో బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రోజు రోజుకు శ్రుతిమించుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేస్తాం. ప్రజలకు ఎలాంటి మంచిపనులు చేస్తాం అని చెప్పడంమాని, కులాల కుంపటి, మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ది పొందేందుకే కమలనాథులు ప్రయత్నిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా తెలంగాణలో అధికారం కోసం బీజేపీ అనుసరిస్తున్న అక్రమ వ్యూహాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. .
మసీదులను కూలగొడతాం, ముస్లింలను తరిమేస్తాం. హిందూరాజ్యాన్ని స్థాపిస్తాం అంటూ దాడులను ప్రేరేపించేలా కమలనాథులు చేస్తున్న వ్యాఖ్యలు అన్నీ ఇన్ని కావు. అయితే దేశం సర్వమతల సమ్మేళనమని, అన్నీ మతాలను సమానత్వంతో చూడాలని సంగతి కమలనాథులకు తెలిదంటారా ? ఒక మతాన్ని హైలెట్ చేసుకోవడానికి మరో మతాన్ని కించపరచాలా ? ఇదేనా రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ? అంటూ బీజేపీ వైఖరిపై దుమ్మెత్తిపోసే అతివాదులు ఎందరో. అయిన ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికి బీజేపీ మాత్రం మతతత్వ రాజకీయాన్ని మాత్రం తగ్గించడం లేదు. ఇదిలా ఉంచితే తాజాగా తెలంగాణకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్స్ ను రద్దు చేస్తామని చెప్పడంతో ముస్లిం సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
Also Read: 2024.. సార్వత్రిక సమరానికి సై…!
ప్రస్తుతం రాష్ట్రంలో ముస్లిం లకు నాలుగు శాతం రిజర్వేషన్స్ అమలౌతున్నాయి. ఈ రిజర్వేషన్స్ వల్ల వెనుక బడిన మైనారిటీ వర్గాలకు మంచి చేకూరుతోంది. మరి అలాంటి రిజర్వేషన్స్ ను రద్దు చేస్తామని బీజేపీ చెప్పడంతో ఇది ముస్లింల పై బీజేపీ అనుసరిస్తున్న కక్ష పూరిత చర్యగా భావిస్తున్నారు కొందరు. అయితే మతాల ప్రతిపాదికన రిజర్వేషన్స్ రాజ్యాంగం ప్రకారం వర్తించవని బీజేపీ వర్షన్ లో వినిపిస్తున్న మాట. అయితే మొదటి నుంచి కూడా బిజేపి విధానాలు ముస్లింలకు వ్యతిరేకంగానే ఉన్నాయి. గతంలో మసీదులు కూల్చుతాం అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు విధితమే. ఆ లెక్కన చూస్తే ముస్లిం రిజర్వేషన్స్ ను రద్దు చేస్తామని చెప్పడం ముస్లింల పట్ల చిన్నచూపు వైఖరే అనేది కొందరు చెబుతున్నా మాట.
Also Read: సామాన్యులపై జీఎస్టీ..అదానీ పోర్టులపై నో జీఎస్టీ!