రుణమాఫీ అర్హుల జాబితాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందన్నారు.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతాంగాన్ని మోసం చేసిందని…అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి రైతులందరికీ రుణమాఫీ చేస్తానని రేవంత్ చెప్పారు కానీ ఎంతమందికి చేశారో స్పష్టం చేయాలన్నారు.
తెలంగాణలో 60లక్షల మంది రైతులు ఉన్నారు…వీరందరికీ రుణ మాఫీ కావాలంటే 49వేల కోట్లు పైగా డబ్బులు అవసరం అన్నారు. కేవలం 17వేల కోట్లతో రుణ మాఫీ చేసి,మొత్తం రైతులకు రుణ మాఫీ చేశామని చెప్తున్నారు అన్నారు. ఏ రోజు వరంగల్ లో సభ పెడతారో చెప్పండి?,ఆ సభలో రుణమాఫీ చేయని రైతుల సభ ఎలా నిండుతుంతో చూడాలన్నారు.
రుణ మాఫీ అయిన అర్హుల జాబితాను బయట పెట్టాలని, పెట్టుబడి సహాయాన్ని రుణమాఫీ కి ఉపయోగించారు అన్నారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదు?,ఎప్పటి లోపు ఇస్తారో చెప్పాలన్నారు. రైతు భరోసా ఇవ్వకుండా ఎన్నికలకి ఎలా వెళ్తారు?,రుణమాఫీ చేయలేదు కాబట్టి రేవంత్ కట్టుకథలు ఆడుతూ ఎమ్మెల్యేల ఆఫీస్ ల మీద దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:కాంగ్రెస్ దాడులను అందరూ ఖండించాలి:బీఆర్ఎస్