బీజేపీలో మార్పు జరుగుతోందా ?

46
- Advertisement -

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఉన్న బీజేపీకి అనుకున్న స్థాయిలో మైలేజ్ రావడం లేదు. నిత్యం అధికార పార్టీని ఎబ్బంది పెట్టె విమర్శలు చేస్తూ రాజకీయ లబ్ది పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ప్రజలు ప్రజలు మాత్రం కాషాయ పార్టీని నమ్మడం లేదు. పాదయాత్రలు చేపడుతున్నప్పటికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడంలేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలోకి కమలనాథులు వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడం ఖాయమని భావిస్తున్న కాషాయ పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టినట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు నడుస్తున్నాయి.

Also Read: బీజేపీ వైసీపీ దోస్తీ.. నో నో !

ముఖ్యంగా రాష్ట్ర కమిటీలలోనూ, జిల్లా అధ్యక్షుల విషయంలో యాక్టివ్ గా లేని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చే విధంగా వ్యూహాలు రచిస్తున్నారట. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ బాస్ బండి సంజయ్ ఆదిశగా ప్రణాళికలు వేస్తున్నాట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై అమిత్ షాతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ కార్యదర్శులతోనూ, ముఖ్య నేతలతోనూ బేటీ నిర్వహించి ఆ సమావేశంలో జిల్లా అద్యక్షుల మార్పుపై చర్చించనున్నారట. ప్రస్తుతం ఉన్న అధ్యక్షులలో దాదాపు 30 మందికి పైగా మెరుగైన పనితీరు కనబరచడం లేదని రాష్ట్ర పెద్దలు ఓ అంచనాకు వచ్చారట.

Also Read: Etela Rajender:పాపం ఈటెల..బీజేపీ డీలా!

అందుకే పార్టీని జిల్లాల వారీగా పూర్తిగా ప్రక్షాళన చేస్తే.. పార్టీ పరిస్థితి కొంత మెరుగుపడే ఆవకాశం ఉందని రాష్ట్ర బీజేపీ పెద్దలు భావిస్తున్నాట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇతర పార్టీల నుంచి ఆశించిన స్థాయిలో చేరికలు కూడా లేకపోవడంతో కమలనాథుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటున్నట్లే కనిపిస్తోంది. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ప్రజల్లో కూడా ఆశించిన స్థాయిలో పార్టీకి ఆధారణ లభించకపోవడం రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు కమలనాథులు. మరి ఎన్నికల నాటికి కాషాయ పార్టీలో ఎలాంటి మార్పులు చేసుకుంటాయో చూడాలి.

- Advertisement -