రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కేంద్ర మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యే లము ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నామన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మునిసిపల్ కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
అనంతరం మాట్లాడిన లక్ష్మణ్…చౌటుప్పల్ లో ఒక రైతు 1100 బస్తాలు కుప్పలు పోసి, ధాన్యం కొనుగోలు కాక బిక్కుబిక్కుమంటున్నారు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన పాదయాత్ర కాదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల దీనస్థితి తెలుసుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో రైతులు గోస తీస్తున్నారు.,..మంత్రులు ఏం చేస్తున్నారు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.
నెలలు గడుస్తున్నా కల్లాలలో ధాన్యం కొనుగోలు కాక ధాన్యం ఖరాబు అవుతుందని… ప్రభుత్వం కొనుగోలు చేయక పోవడం వల్ల దళారులు రంగ ప్రవేశం చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు అన్నారు.దళారులు బాగు పడుతున్నారు, మిల్లర్లు బాగుపడుతున్నారు కానీ రైతులు బాగుపడతలేరు అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు క్వింటాల్ వడ్ల మీద 1000 రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందని… 95 లక్షల టన్నుల వడ్ల రైతులు పండిస్తే ఇప్పటివరకు ప్రభుత్వం 50 వేల టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు అన్నారు.
రైతు ప్రభుత్వం అని రైతులకు ఏదో ఒరగబెడతామని, గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసిందని.. రైతులకు వచ్చే ప్రతి ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బోనస్ ఇచ్చిన పాపాన పోలేదు అని…ఎన్నికల మీదు ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేద మీద రైతులకు ఎన్నో హామీలు ఇచ్చింది.ఓడ దాటినదాకా ఓడ మల్లయ్య, ఓడ దాటాక బోడ మల్లయ్య అన్న చందంగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నారు.
రుణమాఫీ కూడా అరకొరగా జరిగిందని…కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అబద్ధపు మోసాలు చెప్తున్నారు అన్నారు.ఇంతవరకు రైతులకు రైతుబంధు లేదు రైతు భరోసా లేదు రైతు రుణమాఫీ కూడా పూర్తిగా కాలేదు అని… సోనియాగాంధీ జన్మదినం డిసెంబర్ 9న మీకు రుణమాఫీ చేస్తామని రైతులకు చెప్పి ఇప్పటివరకు 11 నెలలు గడుస్తున్నా ఇలాంటి రుణమాఫీ పూర్తి కాలేదు అన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఈరోజు తెలంగాణలో జరుగుతుంది…కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అన్ని రకాల వండ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం సన్న వడ్ల కు మాత్రమే బోనసిస్తామని రైతులను మోసం చేస్తుందన్నారు.
తెలంగాణలో రైతులు అత్యధికంగా దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి సన్న వడ్లకు బోనసిస్తామని మోసం చేస్తున్నారు… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న రైతులపై ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి కల్లాల్లోకి వచ్చి రైతులకు దీనస్థితి తెలుసుకోవాలన్నారు. మోడీ ప్రభుత్వం రైతులపై చిత్తశుద్ధితో పనిచేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది…ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మాటల తూటాలను పక్కనపెట్టి రైతులకు న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం అన్నారు.