యువత దేశ అభివృద్ధికి పాటుపడాలి-దత్తాత్రేయ

226
BJP leader
- Advertisement -

ఓటు హక్కు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని అలానే యువత దేశ అభివృద్ధికి పాటుపడాలని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సోమవారం సికింద్రాబాద్ నామాలగుండు బిజెపి పార్టీ కార్యాలయం ఆవరణలో హైదరాబాద్ నగర బీజేవైఎం అధ్యక్షుడు వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటర్ నమోదు ‘మొదటి ఓటు మోడీ కే’ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆయన విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచంద్ర రావు, బిజెపి సీనియర్ నాయకులు బండపల్లి సతీష్ గౌడ్, వెంకటరెడ్డి హాజరై ఓటు నమోదు కేంద్రాన్ని ఈ రోజు (4 ఫిబ్రవరి,2019)న సికింద్రాబాద్‌లోని నామాలగుండు వద్ద ప్రారంభించారు.

Bandaru Dattatreya

ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఓటర్ల నమోదును పకడ్బందీగా చేపట్టాలని, ఏ ఒక్కరి ఓటు తొలగిపోకుండా జాగ్రత్త పడాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వేల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని ఆన్ లైన్‌లో ఓటు ఉన్న పోలింగ్ కేంద్రంలో మాత్రం ఓటు లేకపోవడం వలన చాలామంది నిరాశతో, ఆవేదనతో వెనుదిరిగారని తెలిపారు.

ప్రస్తుత దఫాగా చేపడుతున్న నూతన, సవరణ ప్రక్రియలో భాగంగా 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 18-23 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.

- Advertisement -