కాంగ్రెస్‌ది కుటుంబ పార్టీనే:బీజేపీ

8
- Advertisement -

కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానంతో పాటు రాయ్‌బరేలీ నుండి గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ స్థానంలో వయనాడ్ నుండి ప్రియాంక గాంధీ పోటీ చేయనుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

దీనిపై స్పందించారు బీజేపీ నేత అనిల్ ఆంటోని. రాహుల్ గాంధీ వయనాడ్‌కు రాజీనామా చేయడం, రాయ్‌బరేలీ సీటును నిలబెట్టుకోవడంతో ఆ పార్టీ కుటుంబ పార్టీ అని మరోసారి నిరూపితమైందన్నారు.

కాంగ్రెస్ పార్టీ తన ప్రతి చర్య ద్వారా తమది కుటుంబ పార్టీ అని నిరూపించుకుంటుందని చురకలు అంటించారు. రాహుల్ గాంధీ చివరి నిమిషం వరకు తాను వేరే చోట నుంచి పోటీ చేస్తున్నానని వాయనాడ్ ప్రజలకు తెలియకుండా దాచిపెట్టాడని…అందుకే వయనాడ్ ఉప ఎన్నికల్లో దేశం కోసం నిలబడే పార్టీని ఎంచుకోవాలని కోరారు.

Also Read:Devara:’దేవర’కి భారీ డిమాండ్!

- Advertisement -