బీజేపీకి వేరే దారి లేదా ?

61
BJP
- Advertisement -

ప్రస్తుతం ఏపీలో బీజేపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. ఎందుకంటే మొదటి నుంచి జనసేన అండతో ఏపీలో బలపడాలని చూసిన కాషాయ పార్టీకి పవన్ ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభలో బీజేపీతో పొత్తు నుంచి బయటకు వచ్చేందుకు తాము సిద్దమే అన్నట్లుగా పవన్ వ్యవహరించడంతో కమలనాథుల్లో కలవరం మొదలైంది. జనసేన టీడీపీతో కలిసేందుకు ఆసక్తి కనబరుస్తుండడంతో బీజేపీ ఏం చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావడంతో టీడీపీతో పొత్తు విషయంలో పవన్ ఇంకా ఆలస్యం చేసే అవకాశం లేదు..

త్వరలోనే ఈ రెండు పార్టీల పొత్తును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే జనసేన టీడీపీతో కలిసితే బీజేపీ ఏం చేయబోతుందనేదే ఇప్పుడు ప్రశ్న. విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం బీజేపీ కూడా టీడీపీతో చేతులు కలపడం తప్పా వేరే దారి లేదనేది కొందరి అభిప్రాయం. ఇన్నాళ్ళు టీడీపీతో దూరంగా ఉంటూ వచ్చిన బీజేపీ.. తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీతో చేతులు కలిపిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇటీవల రాష్ట్ర బీజేపీ ఉపద్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం అనివార్యం అని చెప్పుకొచ్చారు.

ఇన్నాళ్ళు చాంద్రబాబుతో కలిసేందుకు ససేమిరా అన్న కమలనాథులు ఇప్పుడు కూటమి అనివార్యమని చెబుతుండడంతో వచ్చే ఎన్నికల్లో 2014 సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ టీడీపీ, జనసేన పార్టీలను కాదని బీజేపీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు. ఏపీలో ఏమాత్రం బలపడాలన్న ఇతర పార్టీల చెంతన చేరాల్సి ఉంటుంది. ఇన్నాళ్ళు జనసేన తమతో ఉందనే దైర్యంతో టీడీపీని దూరం పెట్టిన బీజేపీ.. అదే జనసేన ఇచ్చిన స్ట్రోక్ తో టీడీపీతో తప్పక కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి 2014లో విజయం సాధించిన ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

విపక్ష నాయకుడిగా రాహుల్‌ను ఒప్పుకోం: దీదీ

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం..

భారతదేశ విభజన ఎన్నిసార్లు జరిగిందో తెలుసా?

- Advertisement -