వామ్మో ఎలక్షన్స్.. బీజేపీ భయం !

37
- Advertisement -

నిన్న మొన్నటి వరకు ఎన్నికలు ఎప్పుడొచ్చిన తాము సిద్దమే అని చెప్పిన కాషాయ పార్టీ.. ఇప్పుడు ఎన్నికలంటే భయపడుతోందా అనే అవుననే సమాధానం వినిపిస్తోంది. గెలుపుపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న కర్నాటకలోనే ఓటమి తప్పక పోవడంతో.. మిగిలిన రాష్ట్రాలలో బీజేపీ పరిస్థితి అధోగతి పాలే అనేది పోలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకంటే ఈ ఏడాది చివర్లో మరో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. మిజోరాం, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఈ ఏడాది డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇక్కడ బీజేపీని కలవరపెడుతున్న అంశం ఏమిటంటే.. ఈ ఐదు రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ బలంగా లేదు. ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్, వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ కు తిరుగులేదని సర్వేలు చెబుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నప్పటికి.. అది ప్రజలు ఇచ్చిన అధికారం కాదు. గతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా తరువాత పిరాయింపుల కారణంగా బీజేపీ అధికారం చేజికించుకుంది. ఇక మిజోరాంలో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉండగా, తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ అధికారంలో కొనసాగుతోంది.

Also Read: ఆ నలుగురిపై బీజేపీ నజర్ ?

ఇలా ఏ రాష్ట్రం తీసుకున్న బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం లేదనేది విశ్లేషకుల అంచనా. ఆ రకంగా చూస్తే ఐదు రాష్ట్రాలలో కూడా బీజేపీకి ఓటమి తప్పదనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజం అయితే ఈ ఐదు రాష్ట్రాల ప్రభావం వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికలపై గట్టిగా ప్రభావం చూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తోంది బీజేపీ. కానీ బీజేపీ గెలుపోటములను ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు డిసైడ్ చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలన్నీ బెడిసి కొట్టడంతో.. ఈ ఐదు రాష్ట్రాలలో ఆ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల భయం బీజేపీని గట్టిగాగనే వేధిస్తోంది.

Also Read: ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీగా బి‌ఆర్‌ఎస్ !

- Advertisement -