BJP:తమిళనాడులో బీజేపీ పంజా?

24
- Advertisement -

తమిళనాడుపై బీజేపీ గట్టిగా ఫోకస్ చేస్తోందా ? అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. అధికారంలో ఉన్న డీఎంకే మినహా మిగిలిన ప్రాంతీయ పార్టీలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. డీఎంకే పార్టీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీగా ఉన్న అన్నాడీఎంకే గత కొన్నాళ్లుగా అంతర్గత లొసుగులతో బలహీన పడుతూ వస్తోంది. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ మెల్లగా బలహీన పడుతూ వస్తోంది. కమల్ హాసన్, దివంగత విజయ్ కాంత్ వంటి వారు పార్టీలు స్థాపించినప్పటికి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక ఎన్నో ఏళ్లుగా రజనీ రాజకీయ ఆరంగేట్రంపై సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికి ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరం అని తేల్చి చెప్పేశారు. ఇక తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే.

ఆ పార్టీ క్షేత్ర స్థాయిలో విస్తరించడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ మెల్లగా పరిధి పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నమలై కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన నాయకత్వంలో పార్టీ వేగంగానే విస్తరిస్తోంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల సమయానికి పూర్తిగా తమిళనాడులో బలం సాధించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

అయితే ఈలోగా ఈ ఏడాది ఎన్నికల్లో తమిళనాడు నుంచి వీలైనన్ని లోక్ సభ సీట్లు సొంతం చేసుకునే వ్యూహంలో ఉంది కాషాయ పార్టీ. మొత్తం 39 లోక్ సభ స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో కనీసం 20-30 సీట్లు సొంతం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఐతే ఆ స్థాయిలో బీజేపీ సీట్లు సాధించే అవకాశం ఉందా అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయితే డీఎంకే మినహా ఇతర పార్టీలతో పోల్చితే బీజేపీ వేగంగానే బలపడుతోంది. పైగా అన్నా డీఎంకే పార్టీతో బీజేపీ సత్సంబంధాలు కూడా బలంగానే ఉన్నాయి. దీంతో బీజేపీకి బీజేపీకి మెరుగైన ఫలితాలే వస్తాయనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.

Also Read:చర్మం నల్లబడుతుందా..ఇలా చేయండి!

- Advertisement -