రాహుల్‌ నిర్వాకం..ఫ్లాగ్‌ కోడ్‌ ఉల్లంఘన

46
- Advertisement -

గతేడాది సెప్టెంబర్‌7న కన్యాకుమారిలో ప్రారంభించిన భారత్‌జోడో యాత్ర జనవరి 30న శ్రీనగర్‌లో ముగియనున్న వేళ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై సర్వత్రా విమర్శల పాలవుతున్నారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో రాహుల్‌ గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అయితే వేదిక వద్ద ఏర్పాటు చేసిన భారీ కటౌట్‌లు మాత్రం జాతీయ జెండా కంటే ఎత్తుగా కనిపించాయి. ఇది ఫ్లాగ్‌ కోడ్‌ను ఉల్లంఘించినట్టేనని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ మండిపడ్డారు.

ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ…ఒక పార్టీ నాయకుడు అని పిలవబడే వ్యక్తి జాతీయ జెండాను ఎగురవేసే సమయంలో తన కటౌట్‌ల కంటే తక్కువ ఎత్తులో ఉంచి ఎగురవేయడం ద్వారా ఫ్లాగ్‌ కోడ్‌ను పూర్తిగా ఉల్లంఘించినట్టేనని అని అన్నారు. ఇది ఒక విధంగా రాజవంశం యొక్క మనస్తత్వానికి నిదర్శనమన్నారు. తమని తాము రాజవంశీకులమని అందుకే వంశపారంపర్య పార్టీలను ముందుకు తీసుకెళ్లుతున్నారని మండిపడ్డారు.

దీనిపై మరో బీజేపీ ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్ మాట్లాడుతూ… జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడం వల్లే రాహుల్‌కు ఈ అవకాశము దక్కిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కాశ్మీర్‌లో ఉగ్రవాదం మరియు భయం ఉందని అన్నారు. అయితే రాహుల్‌ గాంధీ జనవరి 22న జమ్మూ నగర శివార్లలో జరిగిన జంట పేళ్లళ నేపథ్యంలో భారత్ జోడో యాత్రకు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇవి కూడా చదవండి…

వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం..

ఈ దేశానికి దిక్సూచి…గాంధీ

కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్‌..

- Advertisement -