- Advertisement -
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 14న మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీ తాజాగా తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రస్తుత ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేరును, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు వీరిద్దరి పేర్లను బీజేపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది.
- Advertisement -