ఈటల రాజేందర్…హౌస్ అరెస్ట్

321
etela
- Advertisement -

ఉద్యోగులకు సంఘీభావంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు బయలుదేరిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను ఆయన నివాసం లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సాకు చూపి తెరాస ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని అన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ బదిలీలు ఇష్టారాజ్యంగా చేపట్టి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

ప్రజాప్రతినిధులుగా కనీసం వారికి మద్దతుగా నిలిచే అవకాశం కూడా కల్పించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నల్గొండ వేల మందితో సభ నిర్వహిస్తే వ్యాప్తి చెందదా అని ప్రశ్నించారు. పోలీసులు ప్రతిపక్షాల నాయకులను కనీస గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆయన ఇంటి ముందు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

- Advertisement -