ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన అంశాలకే కాకుండా వివిథ పథకాలను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైనవి సులభతరమైన పరిశ్రమల అనుమతులు ఇచ్చేందుకు టీఎస్‌ఐపాస్,హైదరాబాద్‌కు ప్రపంచస్ధాయి గుర్తింపు తెచ్చేందుకు టీహబ్,రైతులకు భరోసా ఇచ్చేందుకు రుణమాఫీ,చెరువులకు పూర్వవైభవం తెచ్చేందుకు మిషన్ కాకతీయ,పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం కల్యాణలక్ష్మీ,షాదిముబారక్‌తో పలుల పథకాలను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇవే పథకాలను బీజేపీ కర్ణాటకలో తన మేనిఫెస్టోలో పెట్టింది.
కర్ణాటక ఎన్నికల్లో ఓట్ల కోసం.. తెలంగాణలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు పేర్లు మార్చి బీజేపీ తన మేనిఫెస్టోలో కాపీ కొట్టడం సంతోషకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. మిషన్ కాకతీయ పథకానికి మిషన్ కల్యాణి అని, కల్యాణలక్ష్మి పథకానికి వివాహ మంగళ యోజన, రైతులకు రూ.లక్ష రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు.
()దేశవ్యాప్తంగా పారిశ్రామిక వేత్తల దృష్టిని ఆకర్షించేందుకు టీఎస్‌ఐపాస్‌ను తీసుకొచ్చింది. 15 రోజుల్లోనే పరిశ్రమలకు ఎలాంటి అవినీతి లేకుండా అనుమతులు ఇస్తోంది. టీఎస్‌ఐపాస్ తరహాలో కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తామని బీజేపీ ప్రకటించింది.
()ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజల ఆకలి తీర్చేందుకు రూ.5కే అన్నపూర్ణ క్యాంటిన్‌ల పేరుతో భోజన పథకాన్ని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటివరకు కోటి మందికి పైగా ప్రజలు రూ.5 భోజనాన్ని తిన్నారు. అంతేగాదు వరంగల్‌తో మరికొన్ని ప్రాంతాల్లో రూ. 5కే భోజన పథకాన్ని విస్తరించారు. ఇదే పథకాన్ని కాపీ కొడుతూ ముఖ్యమంత్రి అన్నపూర్ణ క్యాంటీన్‌ను బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రతీ జిల్లా కేంద్రంలో మూడు,ప్రతీ తాలుకా కేంద్రంలో ఒక క్యాంటిన్‌ను నెలకొల్పుతామని హామీ ఇచ్చింది.
Imitation is the best form of flattery: Delighted that various welfare & development schemes of @TelanganaCMO have been picked up by BJP in Karnataka polls
1) Mission Kakatiya as ‘Mission Kalyani’
2) Kalyana Lakshmi as ‘Vivaha Mangala Yojana’
3) Farm Loan waiver of 1 lakh1/2 pic.twitter.com/ZavKmUDbQO
— KTR (@KTRTRS) May 4, 2018
() ఇక మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణ ఐటీలో భేష్ అనిపించుకుంటోంది. స్టార్టప్‌లకు ప్రోత్సాహం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీ హబ్‌కు మంచి రెస్పాన్న్ వచ్చింది. ఇదే తరహాలో బీజేపీ ..కే-హబ్‌ను ప్రకటించింది. బెంగళూరు,మంగళూరు,రాయచూరు,మైసూరు,కలబురిగి,హుబ్లి ప్రాంతాల్లో కే-హబ్‌ని నెలకొల్పుతామని హామీ ఇచ్చింది.
()పేదింటి ఆడ బిడ్డల పెళ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రూ. 1,00116లను అందిస్తోంది. ఇదే కార్యక్రమాన్ని వివాహమంగళ యోజనగా ప్రకటించి మూడు గ్రాముల బంగారు తాళిబొట్టు,రూ.25వేల నగదు ఇస్తామని తెలిపింది.
()రైతుల జీవితాల్లో వెలుగుల నింపేందుకు అధికారంలోకి రాగానే రైతులకు లక్షలోపు రుణమాఫీని చేసింది. ఇదే పథకాన్ని కాపీ కొడుతూ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది.
()కాకతీయుల కాలం నాటి చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ మిషన్ కల్యాణి పేరుతో చెరువులు,కుంటలను పునరుద్దరిస్తామని ప్రకటించింది. మొత్తంగా కర్ణాటక ప్రజలను ఆకర్సించేందుకు తెలంగాణ సంక్షేమ పథకాలను బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.