కేజ్రీవాల్‌ హత్యకు కుట్ర!

124
- Advertisement -

సీఎం కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా. మీడియాతో మాట్లాడిన సిసోడియా..ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, గుజరాత్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుందని దుయ్యబట్టారు. ఈ వ్యవహారం వెనుక ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ ఉన్నారని ఆరోపించారు.

అయితే బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు ఆమ్ ఆద్మీ పార్టీ భయపడదని సిసోడియా స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌పై దాడి చేయాలని తమ గూండాలను బీజేపీ బహిరంగంగానే పురిగొల్పుతుందన్నారు. బీజేపీ గూండాయిజానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు అని స్పష్టంచేశారు.

కేజ్రీవాల్‌ భద్రతపై నాకు ఆందోళనగా ఉందని…. ఇప్పటికే ఆప్‌ ఎమ్మెల్యేలను చితకబాదిన ఘటనలు కూడా చూశాం. ఇలాంటి అనుభవం ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎదురు కాకూడదని కోరుకుంటున్నా అని తివారీ వ్యాఖ్యానించగా దీనికి ఘాటుగా స్పందించారు మనీశ్‌. ’ అంటూ వ్యాఖ్యానించారు. తివారీ వ్యాఖ్యలపై తాజాగా మనీశ్‌ సిసోడియా పై విధంగా స్పందించారు.

ఇవి కూడా చదవండి…

- Advertisement -