- Advertisement -
తెలంగాణ కేబినెట్ విస్తరణ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఎలక్షన్ కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేశారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డి.
రేపు తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని.. అజారుద్దీన్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ బైపోల్స్‌కు ముందు అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్ జరగనుండగా.. ఇలాంటి కీలక తరుణంలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది బీజేపీ.
Also Read:యూపీలో పడవ బోల్తా..8 మంది మృతి!

- Advertisement -

