మునుగోడులో బీజేపీ చీప్‌ ట్రిక్స్‌..

339
Munugodu
- Advertisement -

ఓటమి భయంతో మునుగోడులో చిల్లర రాజకీయాలకు తెరలేపింది బీజేపీ. డబ్బులు, మద్యాన్ని నమ్ముకున్న ఆ పార్టీ నేతలకు ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్న తరుణంలో పలిమేల గ్రామంలో బీజేపీ చీప్ ట్రిక్స్‌కు పాల్పడింది.

బీజేపీ కి ఓటు వేయారని తెలిసిన మహిళలకు,వృద్ధుల చేతులకు కమలం పువ్వు గుర్తు వేస్తున్నారు బీజేపీ నేతలు. బ్యూటీషియన్ లతో గోరింటాకు పెడుతాం అంటూ మాయమాటలు చెప్పి బలవంతంగా వృద్ధ మహిళల చేతులకు బీజేపీ గుర్తును వేస్తున్నారు.

చేతుల పై కమలం గుర్తు ఉండడంతో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంది. మహిళ ఓటర్లు లను ప్రలోభ పెడుతుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాకు గోరింటాకు వద్దు అని వాదించిన వినకుండా బలవంతంగా కమలం పువ్వు గుర్తును చేతిలో వేస్తుండటంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక బీజేపీకి ధీటుగా ప్రచారంలో దూసుకుపోతోంది టీఆర్ఎస్. ప్రతి ఊరిలో బీజేపీ మోసపూరిత వాగ్దానాలను వివరిస్తూ పోస్టర్లు వేశారు. మునుగోడు ఓటర్లకు విజ్ఞప్తి…బీజేపీ బూటకపు వాగ్దానాలను నమ్మొద్దు…మోసపోతే… గోసపడతం…ఆగం కాకండి… ఆలోచించి ఓటెయ్యండి ఉన్న పోస్టర్లు ప్రజలను ఆలోచింప చేస్తున్నాయి. ఇక అలాగే కోవర్టు బ్రదర్స్ కోట్లకు అమ్ముడుపోతుంటే.. కండ్ల ముందే మన మునుగోడు భవిత కల్లోలితమవుతుంటే.. చూస్తూ ఉందామా.. చూస్తూనే ఉందామా ? అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ నీచ రాజకీయాలపై పాట ట్రెండింగ్‌గా మారింది.

ఇవి కూడా చదవండి..

మస్క్‌ చేతికి ట్విట్టర్‌..ట్రంప్‌ స్పందన

భారత్ జోడో యాత్ర.. రాహుల్ డ్యాన్స్

ట్విట్టర్‌ కొత్తరూల్స్‌పై ఎలాన్ మస్క్‌..

- Advertisement -