దేశంలో గత 9 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రంలోనే కాకుండా బీజేపీ యేతర రాష్ట్రాలలో కూడా అధికారం చేజిక్కించుకోవాలని కమలనాథులు మొదటి నుంచి గట్టిగా వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే చాలా రాష్ట్రాలలో స్థానిక పార్టీలను కూల్చడం, అక్రమంగా అధికారాన్ని లాక్కోవడం వంటివి చేస్తున్నారు కాషాయ నేతలు. బీజేపీకి అనుకూలంగా ఉంటే సరేసరి లేదంటే ప్రత్యర్థి పార్టీ నేతలపై కేసులు, ఈడీ దాడులు, సిబిఐ సోదాలు ఇలాంటివి నిర్వహిస్తూ ప్రత్యర్థి అనే పార్టే లేకుండా చేసేందుకు కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. దీంతో కమలనాథులు చేసే కుయుక్తి వ్యూహాలు ఎలా ఉంటాయో ప్రత్యర్థి పార్టీలు కూడా బాగానే అంచనా వేస్తున్నాయి. బీజేపీ ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడుతున్నాయి.
Also Read: సిఎం జగన్ కు ” చెల్లి పోటు “!
బీజేపీ అత్యంత ప్రమాదకరమైన పార్టీ అని విపక్ష నేతలు తరచూ విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. అయితే ఈ విమర్శలలో నిజం లేకపోలేదు. ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తే ఇట్టే అర్థమౌతుంది. తాజాగా బీజేపీని క్యాన్సర్ తో పోల్చుతూ విమర్శలు గుప్పించారు సిపిఐ నేత కూసంనేని సాంబశివరావు. బీజేపీ క్యాన్సర్ కంటే డేంజర్ అంటూ ఆయన ద్వాజమెత్తారు. ఆయన వ్యాఖ్యాలను బట్టి చూస్తే బీజేపీపై విపక్ష పార్టీలు ఎంత జాగ్రత్తగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. బీజేపీని ఏమాత్రం నమ్మిన నట్టేట మునగడం ఖాయం అని అన్నీ పార్టీలకు కూడా స్పష్టంగా అర్థమైంది. ఇక వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలు కూడా బీజేపీకి గట్టిగానే బుద్ది చెప్పనున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మోడి సర్కార్ పై గతంలో ఉన్న సానుకూలత ఇప్పుడు ప్రజల్లో కొరవడింది. ఎందుకంటే బీజేపీ చేసున్న నియంత పాలనే అందుకు నిదర్శనం. మరోవైపు బీజేపీకి చెక్ పెట్టేందుకు విపక్షాలన్నీ కూడా ఏకం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలో బీజేపీకి గట్టి షాక్ తగలడం ఖాయం అని కొందరు రాజకీయ వాదులు చెబుతున్నారు.
Also Read: కాంగ్రెస్ కల్లోలం ఇప్పట్లో తగ్గదా ?