బీజేపీ ఆస్తులు రూ.1483 కోట్లు…కాంగ్రెస్ అప్పులు రూ. 324 కోట్లు

534
bjp congress
- Advertisement -

2017-18 సంవత్సరానికి గాను రాజకీయ పార్టీల ఆస్తులు-అప్పుల వివరాలను వెల్లడించింది ఏడీఆర్(అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్‌) సంస్థ. బీజేపీ,కాంగ్రెస్,ఎన్సీపీ,బీఎస్పీ,సీపీఐ,సీపీఎం,తృణమూల్ కాంగ్రెస్ వంటి ఏడు జాతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తుల వివరాలను వెల్లడించింది.

కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆస్తులు ఏకంగా రూ. 1483 కోట్లకు పెరిగాయి. గత ఆర్ధిక సంవత్సరంతో పోలీస్తే బీజేపీ ఆస్తులు 22.27 శాతం పెరిగాయి. 2016-17లో బీజేపీ ఆస్తులు రూ.1,213 కోట్లు కాగా నమోదైన బీజేపీ ఆస్తులు 2017-18లో రూ.1,483 కోట్లకు చేరుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

కాంగ్రెస్ పార్టీ ఆస్తులు రూ. 854 కోట్ల నుంచి 724 కోట్లకు పడిపోగా ఎన్సీపీ ఆస్తులు సైతం రూ.11.41 కోట్ల నుంచి 9.54 కోట్లకు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు మమతా సారథ్యంలోని తృణమూల్ ఆస్తులు రూ.26.25 కోట్ల నుంచి రూ. 29.10 కోట్లకు ఎగబాకాయి.

ఆస్తుల్లో బీజేపీ టాప్‌లో ఉండగా అప్పుల్లో కాంగ్రెస్‌ టాప్‌ప్లేస్‌లో ఉంది. కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా రూ. 324.2 కోట్ల రుణాలున్నట్లు ప్రకటించగా బీజేపీ అప్పులు రూ. 21.38,తృణమూల్ అప్పులు రూ. 10.65 కోట్లుగా ఉన్నాయి. బీఎస్పీ ఆస్తులు రూ. 680.63 కోట్ల నుంచి రూ.716.72 పెరిగాయి. సీపీఎం ఆస్తులు సైతం రూ.463.76 కోట్ల నుంచి రూ.482.1 కోట్లకు పెరిగాయి. ఇక సీపీఐ ఆస్తులు 2016లో రూ.10.88 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.11.49 కోట్లకు పెరిగాయి.

- Advertisement -