బీజేపీ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబిత..

251
BJP
- Advertisement -

బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ నేత జేపీ నడ్డా ఆ జాబితాను విడుదల చేశారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా 182 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. ప్రధాని నరేంద్రమోదీ రెండోసారి వారణాసి పోటీ చేయనున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గాంధీ నగర్ (గుజరాత్ ) లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనుండగా..రాజ్ నాథ్ సింగ్ లక్నో (యూపీ) లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. నితిన్ గడ్కరీ నాగ్ పూర్ (మహారాష్ట్ర), హేమమాళిని మధుర (యూపీ), స్మృతి ఇరానీ అమేథీ (యూపీ) నుంచి ఎన్నికల బరిలో నిలువనున్నారు.

ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి బీజేపీ తరపున పోటీ చేయనున్న లోక్ సభ అభ్యర్థుల వివరాలను కూడా ఆయన ప్రకటించారు. ఏపీ నుంచి రెండు స్థానాలకు మాత్రమే తమ అభ్యర్థులను ప్రకటించారు. విశాఖపట్టణం నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, నరసరావుపేట నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నట్టు తెలిపారు. కాగా, తెలంగాణ నుంచి బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.

ఇక తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్థులు..

నాగర్ కర్నూల్- బంగారు శ్రుతి
నల్గొండ- జితేంద్ర కుమార్
భువనగిరి- పీవీ సుందర్ రావు
వరంగల్- చింతా సాంబమూర్తి
మహబూబాబాద్- హుస్సేన్ నాయక్
కరీంనగర్- బండి సంజయ్,
నిజామాబాద్-డి. అరవింద్
మల్కాజ్ గిరి- ఎన్. రామచంద్రరావు
సికింద్రాబాద్- జి.కిషన్ రెడ్డి
మహబూబ్ నగర్-డీకే అరుణ

- Advertisement -