డయాబెటిస్ కు వీటితో చెక్!

23
- Advertisement -

నేటి రోజుల్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతి పది మందిలో ఇద్దరు లేదా ముగ్గురు డయాబెటిస్ తో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పైగా ఒక్కసారి డయాబెటిస్ బారిన పడితే దాని నుంచి బయట పడటం అంతా తేలికైన విషయం కాదు. అందుకే చాప కింద నీరులా విస్తరిస్తున్న డయాబెటిస్ పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు తరచూ చెబుతుంటారు. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటానికి ఈ షుగర్ వ్యాధినే మొదటి కారణం. అందుకే డయాబెటిస్ వ్యాధిని ప్రారంభ దశలోనే నియంత్రించడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నా మాట. అయితే డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి మెడిసిన్ తో పాటు సరైన ఆహార శైలి, జీవన శైలి కూడా ఎంతో ముఖ్యం. .

మన చుట్టూ ఉండే ఎన్నో తినదగిన ఆహార పదార్థాలు డయాబెటిస్ ను అదుపులో ఉంచడంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. వాటి గురించి చాలమందికి తెలియదు. కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం లాంటిది. దీనిని రసం రూపంలో సేవించిన లేదా కూరగా చేసుకొని ఆరగించిన రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. సొరకాయ కూడా షుగర్ వ్యాధి గ్రస్తులకు అద్బుతంగా పని చేస్తుంది. ఇందులో 90 శాతం నీరు, మినరల్స్ ఎక్కువగా ఉండి చక్కెర సమ్మేళనాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల డయాబెటిస్ ను సొరకాయ అదుపులో ఉంచుతుంది. ఇంకా జొన్న రొట్టె, రాగి జావా, వంటివి కూడా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తాయి. వీటితో పాటు ఆకు కూరలు, మనం తింటే ఆహారంలో చేర్చుకోవాలి. తద్వారా డయాబెటిస్ నుంచి త్వరగా బయట పడవచ్చు. వీటిని తింటూనే చక్కెర సంబంధిత పదార్థాలు, జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండడం వల్ల డయాబెటిస్ ను వేగంగా నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:లబ్దిదారులే స్టార్ క్యాంపెయినర్లు!

- Advertisement -