రుచిలో చేదు కలిగిన కూరగాయలలో కాకరకాయ మొదటి స్థానంలో ఉంటుంది. దీనికి ఉండే చేదు రుచి కారణంగా చాలమంది కాకరకాయను తినడానికి ఇష్టపడరు. అయితే కాకరకాయ తినడం వల్ల ఎన్నో ప్రయోజనలు ఉన్నాయని న్యూట్రీషియన్స్ తరచూ చెబుతూనే ఉంటారు. ఇందులో విటమిన్ సి, ఏ వంటివి పుష్కలంగా ఉంటాయి, అందువల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇంకా చర్మ సంరక్షణలోనూ, కళ్ల యొక్క ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలోనూ కాకర ఎంతగానో ఉపయోగ పడుతుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు కూడా చాలానే ఉంటాయి.
అందువల్ల సీజనల్ గా వర్షాకాలంలో వచ్చే మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులను ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని కాకరకాయ అందిస్తుంది. అయితే కాకరకాయ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పటికి దానితో చేసిన కూరను తినడానికి ఆసక్తి చూపారు చాలమంది. అలాంటి వారు కాకరకాయతో జ్యూస్ చేసుకొని తాగితే బెటర్ అని న్యూట్రీషియన్స్ సలహా ఇస్తున్నారు. కాకరకాయను జ్యూస్ చేసుకొని అందులో పటిక బెల్లం వేసుకొని సేవిస్తే ఎంతోమేలట.
ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం పడగడుపున ఈ కాకరకాయ జ్యూస్ తాగితే ఎటువంటి ఉదర సమస్యలైన దురమౌతాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మలబద్దకంతో బాధపడే వారు తప్పనిసరిగా ప్రతిరోజూ ఉదయం తాగితే మంచిదట. ఇంకా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా కాకరకాయ రసం చక్కగా ఉపయోగ పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా కాకరకాయను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఆల్కలైడ్లు రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తాయట. అంతే కాకుండా కిడ్నీలో రాళ్ళను కరిగించడంలో కూడా కాకరకాయ జ్యూస్ ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read:జాజికాయ పొడితో ఆ సమస్యలు దూరం!