బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌కు బెదిరింపులు!

5
- Advertisement -

కెనడాలోని కమెడియన్ కపిల్ శర్మ యాజమాన్యంలో ఉన్న క్యాప్స్ కేఫేపై దాడి చేసింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు హ్యారీ బాక్సర్. సల్మాన్ ఖాన్‌తో పని చేయకూడదని ఫిల్మ్ మేకర్స్‌కు హెచ్చరించాడు. సల్మాన్‌తో పని చేసే వారిని వదిలిపెట్టం… వాళ్లను చంపడానికి అవసరమైనంత దూరం వెళ్తాం అని హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ లీక్ కావడం సంచలనంగా మారింది.

కమెడియన్ కపిల్ శర్మ కెనడాలోని క్యాప్స్ కేఫే గురువారం మళ్లీ దాడి జరిగింది. గత జూలై 8న తొలిసారి దాడి జరిగింది. ఈ దాడికి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మరియు అతని గ్యాంగ్ బాధ్యత వహించామని చెప్పి, కపిల్ శర్మ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు సన్నిహితుడని భావించి టార్గెట్ చేశామని పేర్కొన్నారు.

మొదటి ఫైరింగ్, ఇప్పుడు రెండో ఫైరింగ్ – రెండూ కపిల్ శర్మ రెస్టారెంట్‌పైనే జరిగాయి. కారణం, అతను నెట్‌ఫ్లిక్స్ షో ప్రారంభోత్సవానికి సల్మాన్ ఖాన్‌ను ఆహ్వానించడం అన్నారు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు హ్యారీ బాక్సర్. సల్మాన్‌తో పని చేసే ప్రతి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్‌ను – చిన్న యాక్టర్ అయినా, చిన్న డైరెక్టర్ అయినా – వదలబోమని హెచ్చరించాడు…వాళ్లను చంపేస్తాం. చంపడానికి ఏ స్థాయికైనా వెళ్తాం అని హెచ్చరించాడు.

Also Read:కాంతార చాప్టర్‌ 1లో రుక్మిణి వసంత్‌!

- Advertisement -