- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ 64 స్థానాలతో అధికారంలోకి రాగా సీఎంగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇక పాలనలో తన మార్క్ చూపిస్తున్న రేవంత్ ఇప్పటికే పెద్ద ఎత్తున ఐపీఎస్, ఐఏఎస్‌ల బదిలీ చేపట్టారు.
ఇక తాజాగా ప్రభుత్వ విప్‌లుగా నలుగురిని నియమించారు రేవంత్. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో పాటు అడ్డూరు లక్ష్మణ్ కుమార్, రామచంద్రనాయక్‌లకు విప్ పదవులు దక్కగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
- Advertisement -