తల్లైన బిపాషా బసు!

189
bipasa
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు తల్లైంది. తన ప్రియుడు, నటుడు కరణ్ గ్రోవర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న బిపాషా తల్లైంది. తమ కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరిగిందని.. దేవీమా అనుగ్రహంతో తమకు పండంటి ఆడబిడ్డ జన్మించిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

బిపాషా తల్లి కావడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులుగా తమ జీవితంలో మరో మెట్టు పైకి ఎక్కిన బిపాషా, కరణ్ గ్రోవర్‌లకు పలువురు బాలీవుడ్ స్టార్స్ విషెస్ తెలిపారు.

- Advertisement -