ఓ ఆరేడు నెలల క్రితం వరకు వరుణ్ మణియన్ ఎవరో తెలియదు. త్రిష పుణ్యమా అని తమిళనాడుతో పాటు ఇరుగు, పొరుగు రాష్ర్టాల వాళ్లకి కూడా వరుణ్ మణియన్ ఎవరో తెలిసిపోయింది. ఇతగాడు పెద్ద వ్యాపారవేత్త అనీ, తమిళ చిత్రాలు నిర్మిస్తాడనీ అందరికీ తెలిసింది. అది మాత్రమే కాదు.. త్రిష అతనితో ప్రేమలో పడిన విషయం, ఈ ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే.
నిశ్చితార్థం జరిగి మూడు నెలలు జరగకముందే ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అవటంతో వరుణ్ పాపులరై పోయాడు. త్రిష దెబ్బకు వరుణ్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. తర్వాత వరుణ్ మళ్లీ లైమ్ లైట్లో లేకుండా పోయాడు. త్రిషతో బ్రేకప్ అయ్యాక కొన్నాళ్లు సైలెంటుగా ఉండిపోయిన వరుణ్ … ఇప్పుడు మళ్లీ వార్తల్లొకొచ్చాడు.
తమిళ సినీ పరిశ్రమలో సెటిలైన తెలుగమ్మాయి బిందు మాధవితో లవ్ ఎఫైర్‌తో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వరుణ్-బిందు ఎఫైర్ గురించి వార్తలు ఊరికే పుట్టలేదు. వీళ్లిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. త్రిష లాంటి స్టార్ హీరోయిన్ ను మేనేజ్ చేయడం కష్టమనో ఏమో.. వరుణ్ తన రేంజికి తగ్గట్లుగా చిన్న రేంజి హీరోయిన్ తో సెటిలైపోదామనుకున్నట్లున్నాడు. బిందుమాధవికి కథానాయికగా పెద్దగా అవకాశాలేమీ లేవిప్పుడు. అందుకే ఇక లైఫ్ లో సెటిలైపోదామని చూస్తున్నట్లుంది. మరి వీరి బంధమైన పెళ్లి పీటలెక్కుతుందో లేదో చూడాలి.