టాలీవుడ్‌లో హీరోగా, నిర్మాతగా ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులు హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్.. మరో ఎక్స్‌పెరిమెంట్‌కు సిద్ధమయ్యారు. ఈసారి చారిత్రక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కళ్యాణ్ రామ్ తాజాగా ‘బింబిసార’ అనే హిస్టారికల్ మూవీలో నటిస్తున్నారు. . క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు.
ఈ చిత్రానికి వశిష్ఠ (నిర్మాత మల్లిడి సత్యనారాయణరెడ్డి తనయుడు) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతర పాత్రల్లో శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్ కనిపించనున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ‘బింబిసార’ సినిమా డిసెంబర్ లో విడుదల కానున్నట్టు సమాచారం. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 2న ఓ సీనియర్ స్టార్‌హీరో సినిమా విడుదల కాబోతోంది. ఆ సినిమా ప్రదర్శనతో పాటు ‘బింబిసార’ విడుదలతేదీతో కూడిన ట్రైలర్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ సరసన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది.