ఓటీటీలో కూడా బింబిసార సూపర్ హిట్‌

135
- Advertisement -

 2022వ సంవత్సరం సినీ ప్రేక్షకులకు పండగ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరంభంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని నమోదు చేసుకొని ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పోందింది. దాని తర్వాత వచ్చిన సినిమాలు కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకొని బ్లాక్ బస్టర్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆ కోవలోకి చెందిన బింబిసార ఒకటి. కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి మల్లాడి విష్ణు దర్శకత్వం వహించాడు.

ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే హైయెస్ట్‌ కలెక్షన్‌లను సాధించిన చిత్రంగా ‘బింబిసార’ నిలిచింది. ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. డ్యూయల్‌ రోల్‌లో కళ్యాణ్‌రామ్‌ అద్భుతంగా నటించాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓటీటీలోనూ ఈ చిత్రం దూసుకుపోతుంది.

అక్టోబర్ 21నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5లో స్ట్రీమంగ్‌ అవుతున్న ఈ చిత్రం డిజిటల్‌లోనూ ఘన విజయం సాధిస్తుంది. ఈ చిత్రం తాజాగా 200మిలియన్‌(20 కోట్ల) స్ట్రీమింగ్‌ ‌ను సొంతం చేసుకుంది. ఇంత వేగంగా ఈ ఘనతను అందుకున్న సినిమాగా బింబిసార జీ-5లో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో కళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథరీన్‌ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్‌లుగా నటించారు.

ఎన్టీఆర్‌ ఆర్స్ట్ పతాకంపై కళ్యాణ్‌ రామ్‌ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రూ.15 కోట్ల వరకు బిజినెస్‌ జరుపుకున్న ఈ చిత్రం ఫైనల్‌గా రూ.36 కోట్ల వరకు షేర్‌ సాధించి బ్లాక్‌ బస్టర్‌ సినిమాగా నిలిచింది. ప్రస్తుతం ‘బింబిసార-2’ స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ సీక్వెల్‌ పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

కార్తీ…జపాన్ అప్‌డేట్!

తల్లైన బిపాషా బసు!

యశోద ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

- Advertisement -